ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Drone Pakodas: డ్రోన్ పకోడాలను చూశారా.. ఇప్పుడు ఇదే సరైన స్నాక్ అంటూ మాజీ ఆర్మీ అధికారి పోస్ట్

ABN, Publish Date - May 11 , 2025 | 08:57 PM

భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో డ్రోన్‌లు చాలా పెద్ద చర్చనీయాంశంగా మారాయి. భారత్ ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్‌కు ప్రతిస్పందనగా పాకిస్తాన్ డ్రోన్‌లతో దాడులు చేయడం మొదలుపెట్టింది. సరిహద్దు గ్రామాలపై డ్రోన్ దాడులకు దిగింది.

Drone Pakodas

భారత్-పాకిస్తాన్ (India-Pakistan) ఉద్రిక్తతల నేపథ్యంలో డ్రోన్‌లు (Drone) చాలా పెద్ద చర్చనీయాంశంగా మారాయి. భారత్ ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్‌కు ప్రతిస్పందనగా పాకిస్తాన్ డ్రోన్‌లతో దాడులు చేయడం మొదలుపెట్టింది (Drone Attack). సరిహద్దు గ్రామాలపై డ్రోన్ దాడులకు దిగింది. అయితే మన దేశ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఆ డ్రోన్‌లను అడ్డుకుని వాటిని గాల్లోనే పేల్చేసింది. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి తయారు చేసిన డ్రోన్ పకోడీలు (Drone Pakodas) సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


ఆ ఫొటోలను టైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్‌ ధిల్లాన్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. డ్రోన్ పకోడాస్‌, ఎయిర్ డిఫెన్స్ రెజిమెంట్‌లో కొత్త స్నాక్, జై హింద్ అంటూ కామెంట్ చేశారు. పాక్‌ డ్రోన్లను మన సైన్యం పకోడాల్లా తినేసిందనే అర్థం వచ్చేలా మాజీ సైనిక అధికారి ఈ పోస్ట్ చేశారు. ఆ పకోడీలు చూడడానికి అచ్చం డ్రోన్ల మాదిరిగా ఉన్నాయి. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ధిల్లాన్ చేసిన ఈ పోస్ట్‌ను ఇప్పటివరకు 7 లక్షల మందికి పైగా వీక్షించారు. 16 వేల మందికి పైగా ఆ పోస్ట్‌ను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. అలాగే పంజాబీలందరూ ఈ డ్రోన్ పకోడీలను తినాలని ఆయన సరదాగా సూచించారు. భారత సైన్యం ఉపయోగించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పట్ల తామంతా ఎంతో గర్వపడుతున్నామని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి..

Indian Army: భోజనం కోసం ఓ దాబా దగ్గరకు వచ్చిన ఆర్మీ.. స్థానిక ప్రజలు ఏం చేశారో చూడండి..


Optical Illusion Test: మీ కళ్ల పవర్‌కు టెస్ట్.. ఈ పార్క్‌లో కొవ్వొత్తి ఎక్కడుందో కనుక్కోండి చూద్దాం


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 11 , 2025 | 08:57 PM