Indian Army: భోజనం కోసం ఓ దాబా దగ్గరకు వచ్చిన ఆర్మీ.. స్థానిక ప్రజలు ఏం చేశారో చూడండి..
ABN , Publish Date - May 11 , 2025 | 05:54 PM
భారత సైన్యం అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించింది. పాక్ దాడులను తిప్పికొడుతూ దాడి చేసింది. ప్రాణాలకు తెగించి పోరాడింది. భారత సైన్యం దాడికి తట్టుకోలేక పాకిస్తాన్ దిగివచ్చింది. మధ్యవర్తి ద్వారా కాల్పుల విరమణ కోసం ప్రాధేయపడింది.
ఇటీవల పాకిస్తాన్ (Pakistan)తో జరిగిన ఘర్షణల్లో భారత సైన్యం అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించింది. పాక్ దాడులను తిప్పికొడుతూ దాడి చేసింది. ప్రాణాలకు తెగించి పోరాడింది. భారత సైన్యం దాడికి తట్టుకోలేక పాకిస్తాన్ దిగివచ్చింది. మధ్యవర్తి ద్వారా కాల్పుల విరమణ కోసం ప్రాధేయపడింది. దీంతో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. భారత ప్రతిష్టను ఇనుమడింప చేసిన భారత సైన్యంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి (Indian Army).
తాజాగా ఆర్మీకి చెందిన సైనికులు ప్రయాణం చేస్తూ ఉత్తరప్రదేశ్ (UttarPradesh)లోని హాపూర్‌లో ఉన్న ఒక ధాబా (Dhaba) వద్ద భోజనం కోసం ఆగారు. ఆర్మీ సిబ్బందిని చూసిన స్థానికులు వారికి ఘన స్వాగతం పలికారు. ధాబాలోని సిబ్బంది, స్థానికులు సైనికులకు ఆత్మీయ స్వాగతం పలికారు. భారత్ మాతా కీ జై, 'వందేమాతరం' నినాదాలు చేస్తూ సైనికులపై పూల వర్షం కురిపించారు. వారితో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. దేశాన్ని క్లిష్ట పరిస్థితుల నుంచి రక్షించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
సైనికులను చూసిన చాలా మంది భావోద్వేగానికి గురయ్యారు. ఆ మధుర క్షణాలను మొబైల్స్‌లో బంధించేందుకు పోటీ పడ్డారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్ అవుతున్న ఆ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వారు నిజమైన హీరోలంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..