Dogs Video: పిల్లి అనుకుని వెంబడించిన కుక్కలు.. చివరకు అసలు విషయం తెలిసి పరుగో పరుగు..
ABN, Publish Date - Jul 17 , 2025 | 02:06 PM
జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే నవ్వు రాక తప్పదు. ఆ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా, ఆసక్తికరంగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా జంతువులకు (Animals) సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో (Funny Videos) చూస్తే నవ్వు రాక తప్పదు. ఆ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది.
@gharkekalesh అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Videos) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ ఇంటి నుంచి బయటకు ఓ చిరుత పులి (Leopard) వచ్చింది. సైజులో కొంచెం చిన్నగా ఉన్న ఆ చిరుత పులి చూడడానికి పిల్లిలా ఉంది. అది పిల్లే అని భ్రమించిన కొన్ని కుక్కలు (Dogs) దాని వెనుక పరిగెత్తాయి. దాదాపు పది కుక్కలు దానిని వెంబడిస్తూ ఓ వీధిలోకి వెళ్లాయి. కాసేపటికి ఆ కుక్కలన్నీ ప్రాణభయంతో వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చాయి. అది పిల్లి కాదు.. చిరుత అని తెలుసుకుని పరుగులు పెట్టాయి. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది.
ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 17 లక్షల మందికి పైగా వీక్షించారు. 24 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలనుతెలియజేశారు. ఆ చిరుత పులి చూడడానికి పిల్లిలా కనబడుతోందని ఒకరు కామెంట్ చేశారు. లోపలికి తొమ్మిది కుక్కలు వెళ్లాయని, బయటకు మాత్రం ఎనిమిదే వచ్చాయని ఒకరు కామెంట్ చేశారు. ఆ కుక్కలు ఇంకెప్పుడూ రాత్రిపూట బయట తిరగవని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
చిన్న పిల్లలకు వంటింటి చిట్కా.. ఎంత ప్రమాదకరం అంటే..
గర్ల్‌ఫ్రెండ్‌ను ఎత్తుకుని హాస్పిటల్‌కు తీసుకొచ్చిన యువకుడు.. తర్వాతేం జరిగిందో తెలిస్తే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jul 17 , 2025 | 02:06 PM