Viral News: గర్ల్‌ఫ్రెండ్‌ను ఎత్తుకుని హాస్పిటల్‌కు తీసుకొచ్చిన యువకుడు.. తర్వాతేం జరిగిందో తెలిస్తే..
ABN , Publish Date - Jul 17 , 2025 | 08:39 AM
వారిద్దరూ గత మూడేళ్లుగా సహజీవనం సాగిస్తున్నారు. వివాహం చేసుకోకుండా ఒకే ఇంట్లో కలిసి నివసిస్తున్నారు. అయితే ఆమెను మంగళవారం ఏదో విషపూరిత కీటకం కుట్టింది. దీంతో ఆమెను బాయ్‌ఫ్రెండ్ వెంటనే హాస్పిటల్‌కు ఆటోలో తీసుకొచ్చాడు. ఆమెను ఎత్తుకుని మరీ లోపలికి తీసుకెళ్లాడు.
వారిద్దరూ గత మూడేళ్లుగా సహజీవనం (Live-in) సాగిస్తున్నారు. వివాహం చేసుకోకుండా ఒకే ఇంట్లో కలిసి నివసిస్తున్నారు. అయితే ఆమెను మంగళవారం ఏదో విషపూరిత కీటకం కుట్టింది. దీంతో ఆమెను బాయ్‌ఫ్రెండ్ (Boy friend) వెంటనే హాస్పిటల్‌కు ఆటోలో తీసుకొచ్చాడు. ఆమెను ఎత్తుకుని మరీ లోపలికి తీసుకెళ్లాడు. అయితే ఆమె పరిస్థితి విషమించి చనిపోవడంతో అసలు విషయం బయటపడింది. మధ్యప్రదేశ్ (MadhyaPradesh)లోని గ్వాలియర్‌లో ఈ ఘటన జరిగింది.
మూడేళ్ల క్రితం సోనీ అనే యువతి గ్వాలియర్ రైల్వేస్టేషన్‌లో చేతన్ కుక్రేజా అనే వ్యక్తిని అనుకోకుండా కలిసింది. వారిద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఆ తర్వాత ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఆ తర్వాత వారిద్దరూ సహజీవనం ప్రారంభించారు. ఇద్దరూ ఒకే దగ్గర ఉద్యోగం చేసుకుంటూ కలిసి జీవించడం ప్రారంభించారు. మంగళవారం ఉదయం ఆమెను ఏదో విషపూరిత కీటకం కుట్టింది. దీంతో చేతన్ ఆమెను వాచ్‌మెన్ సహాయంతో ఆటోలో హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. ఆటో నుంచి ఆమెను ఎత్తుకుని హాస్పిటల్ లోపలికి తీసుకెళ్లాడు.
తన పేరును తప్పుగా చెప్పి ప్రేయసిని హాస్పిటల్‌లో జాయిన్ చేశాడు. ఆమె పరిస్థితి విషమంగా ఉందనే అనుమానం రావడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. దీంతో డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ కెమెరాల ఆధారంగా ఆటో నెంబర్‌ను ట్రేస్ చేసి ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. చనిపోయిన యువతి బాయ్‌ఫ్రెండ్‌పై కేసు నమోదు చేసి అతడిని పట్టుకునే పనిలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
చిన్న పిల్లలకు వంటింటి చిట్కా.. ఎంత ప్రమాదకరం అంటే..
మీది డేగ చూపు అయితే.. ఈ చెట్టుపై ఉన్న గుడ్లగూబను 8 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..