Viral Jugaad: ఇన్ని తెలివితేటలు ఎక్కడివి స్వామి.. పాత బల్బును ఎలా మార్చేశారో చూడండి..
ABN, Publish Date - Aug 15 , 2025 | 01:43 PM
మన దేశంలో చాలా మంది అద్భుతంగా ఆలోచించగలరు. ఎంత పెద్ద సమస్యకైనా సులభమైన పరిష్కారం కనిపెడతారు. డబ్బు ఖర్చు పెద్దగా లేకుండా నూతన ఆవిష్కరణలు చేయగలరు. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మన దేశంలో చాలా మంది అద్భుతంగా ఆలోచించగలరు. ఎంత పెద్ద సమస్యకైనా సులభమైన పరిష్కారం కనిపెడతారు. డబ్బు ఖర్చు పెద్దగా లేకుండా నూతన ఆవిష్కరణలు (Innovations) చేయగలరు. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు (Jugaad Video) సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి చాలా తక్కువ ఖర్చుతో తన బాత్రూమ్‌లో షవర్ (Shower) ఏర్పాటు చేసుకున్నాడు.
casm.saurabh అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ ఇంటి బాత్రూమ్‌లో వినూత్నమైన షవర్ కనబడుతోంది. బాత్రూమ్‌లో ఉన్న ఓ కొళాయి (Tap)కి ప్లాస్టిక్ పైప్ బిగించాడు. ఆ పైప్ చివరన ఓ పాడైపోయిన బల్బు (Bulb)ను బిగించాడు. ఆ బల్బుకు రంధ్రాలు చేశాడు. దీంతో ఆ కొళాయి ఓపెన్ చేయగానే ఆ పైప్ గుండా నీరు బల్బు లోపలికి వెళ్లి షవర్ తరహాలో నీటిని వెదజల్లుతుంది. ఈ ఐడియాను వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
ఈ వైరల్ వీడియోను వేల మంది వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి అని ఒక వ్యక్తి ప్రశ్నించారు. ఈ టెక్నాలజీ ఇండియా దాటి బయటకు వెళ్లకూడదని మరొకరు కామెంట్ చేశారు. ఈ జుగాడ్‌ను కచ్చితంగా బీహార్‌కు చెందిన వ్యక్తే చేసి ఉంటాడని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. ఇతను మామూలు దొంగ కాదు.. తాళం కప్పను విడగొట్టడానికి ఎలాంటి ట్రిక్ వాడాడో చూడండి..
పనిలో పడి కొడుకును పట్టించుకోలేదు.. చివరకు ఏం జరిగిందో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Aug 15 , 2025 | 01:43 PM