ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: సిక్స్ కొట్టి పిచ్‌లోనే ప్రాణాలు వదిలిన ఆటగాడు

ABN, Publish Date - Jun 29 , 2025 | 06:08 PM

Viral Video: హర్‌జీత్ సింగ్ స్థానికంగా జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. బ్యాటింగ్‌కు దిగి ఆపోజిట్ టీమ్‌కు చుక్కలు చూపించాడు. ఈ నేపథ్యంలోనే ఓ సిక్స్ కొట్టాడు.

Viral Video

మనిషి జీవితం చాలా చిన్నది. ఎంత చిన్నది అంటే.. రెప్పపాటు కాలం అంత. అందుకే అంటారు.. ‘కళ్లు తెరిస్తే జననం.. కళ్లు మూస్తే మరణం’ అని. ఈ మధ్య కాలంలో కార్డియాక్ అరెస్ట్ కారణంగా చనిపోతున్న వారి సంఖ్య బాగా పెరిగింది. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు ఉన్నట్లుండి చనిపోతున్నారు. తాజాగా, క్రికెట్ ఆడుతున్న ఓ వ్యక్తి పిచ్‌లోనే ప్రాణాలు వదిలాడు. సిక్స్ కొట్టి మరీ కన్నుమూశాడు. ఈ సంఘటన పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది.

సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. పంజాబ్, ఫిరోజ్‌పూర్‌కు చెందిన హర్‌జీత్ సింగ్ స్థానికంగా జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. బ్యాటింగ్‌కు దిగి ఆపోజిట్ టీమ్‌కు చుక్కలు చూపించాడు. ఈ నేపథ్యంలోనే ఓ సిక్స్ కొట్టాడు. తర్వాత మెల్లగా కొంత దూరం ముందుకు నడిచాడు. ఓ చోట కింద కూర్చున్నాడు. ఉన్నట్టుండి ముందుకు పడిపోయాడు. దీంతో మిగిలిన ఆటగాళ్లు అతడి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. హర్‌జీత్‌ సింగ్‌ను పైకి లేపే ప్రయత్నం చేశారు.

అతడు పైకి లేవలేదు. సీపీఆర్ కూడా చేశారు. లాభం లేకుండా పోయింది. అప్పటికే అతడు చనిపోయాడు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా అతడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘జీవితం చాలా చిన్నది. ఎప్పుడు ఎలా చనిపోతామో తెలీదు. అందరితో మంచిగా ఉండండి’..‘ఈ మధ్య కాలంలో కార్డియాక్ అరెస్టుతో జనం చనిపోవటం బాగా పెరిగింది’ అని కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

రెచ్చిపోయిన ప్రేమ జంట.. బైకుపై బరితెగించి..

యువ రచయిత సూరాడ ప్రసాద్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు..

Updated Date - Jun 29 , 2025 | 06:12 PM