ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: రెచ్చిపోయిన ప్రేమ జంట.. బైకుపై బరితెగించి..

ABN, Publish Date - Jun 29 , 2025 | 05:22 PM

Viral Video: హైవేపై కొంత దూరం వెళ్లిన తర్వాత వాళ్లు ఓ విన్యాసానికి తెర తీశారు. ప్రియురాలు.. ప్రియుడికి ఎదురుగా.. బైకు హెడ్ ‌లైటు డూముపై వెల్లకిలా పడుకుంది. ప్రియుడు వేగంగా బైకు నడుపుతూ ఉన్నాడు.

Viral Video

ప్రేమ పేరుతో వింత, విచిత్రమైన విన్యాసాలు చేసే వారు ఎక్కువైపోయారు. ‘మేము ప్రేమికులం’ అని ప్రపంచం మొత్తానికి తెలియడానికి బరితెగించి ప్రవర్తిస్తున్నారు. మరీ ముఖ్యంగా బైకులపై రెచ్చిపోతున్న ప్రేమ జంటల సంఖ్య బాగా పెరిగిపోయింది. నెలకు కనీసం ఒక సంఘటనైనా వెలుగులోకి వస్తోంది. తాజాగా, ఉత్తర ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో ఓ ప్రేమ జంట బైకుపై విన్యాసం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వటంతో.. ట్రాఫిక్ పోలీసులు ఆ వ్యక్తికి షాక్ ఇచ్చారు.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, ఫిరోజాబాద్‌కు చెందిన ఓ ప్రేమ జంట రాత్రి 10 గంటల సమయంలో ఆగ్రా-కాన్పూర్ నేషనల్ హైవే పైకి వచ్చింది. హైవేపై కొంత దూరం వెళ్లిన తర్వాత వాళ్లు ఓ విన్యాసానికి తెర తీశారు. ప్రియురాలు.. ప్రియుడికి ఎదురుగా.. బైకు హెడ్ ‌లైటు డూముపై వెల్లకిలా పడుకుంది. ప్రియుడు వేగంగా బైకు నడుపుతూ ఉన్నాడు. ఇది గమనించిన ఓ వాహనదారుడు వారిని వీడియో తీశాడు. ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు.

ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రాఫిక్ పోలీసుల దృష్టికి కూడా వెళ్లింది. దీంతో ట్రాఫిక్ అధికారులు సీరియస్ అయ్యారు. అతడిపై 53 వేల రూపాయల ఫైన్ వేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆ వ్యక్తి కోసం అన్వేషిస్తున్నారు. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఆ ప్రేమ జంటపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘బైకు మీద రొమాన్స్ చేస్తూ జీవితాలను నాశనం చేసుకోవద్దు’ అంటూ హితవు పలుకుతున్నారు.

ఇవి కూడా చదవండి

మారనున్న రూల్స్.. ఈ విషయాలు తప్పక తెలుకోండి..

ఆస్తి కోసం 45 ఏళ్ల వ్యక్తిని ట్రాప్.. పెళ్లైన గంటల్లోనే..

Updated Date - Jun 29 , 2025 | 05:27 PM