Close Shave: వీధిలో నడుచుకుంటూ వెళుతున్న బామ్మ.. ఇంతలో ఊహించని సంఘటన
ABN, Publish Date - Aug 05 , 2025 | 11:44 AM
Close Shave: ఆ వృద్ధురాలు గనుక ఐదు సెకన్లు ఆలస్యం చేసి ఉంటే పెను విషాదం చోటుచేసుకుని ఉండేది. ఆ శిథిలాల కింద పడి చనిపోయి ఉండేది. రాళ్లు పడ్డ తీవ్రతకు కరెంట్ తీగ తెగి సర్రున ఎగిరి పోయింది.
వీధిలో నడుచుకుంటూ వెళుతున్న ఓ బామ్మను నిజంగా ఆ దేవుడే కాపాడాడు. అడుగుల తేడాతో.. ఆమె వెనకాల ఓ ఇళ్లు కూలిపోయింది. సెకన్ల తేడాతో ఆమె చావునుంచి తప్పించుకుంది. లేదంటే శిథిలాల కింద శవంగా మిగిలేది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. హార్పూర్‌కు చెందిన ఓ వృద్ధురాలు వీధిలో నడుచుకుంటూ వెళుతోంది. ఆమె అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తూ ఉంది.
ఆమె 20 అడుగులు ముందుకు వెళ్లిన వెంటనే ఎడమ వైపు ఉన్న ఓ పాత ఇళ్లు కూలిపోయింది. ఇంటి తాలూకా రాళ్లు ఆమె కాలి వరకు వెళ్లిపడ్డాయి. ఆ వృద్ధురాలు గనుక ఐదు సెకన్లు ఆలస్యం చేసి ఉంటే పెను విషాదం చోటుచేసుకుని ఉండేది. ఆ శిథిలాల కింద పడి చనిపోయి ఉండేది. రాళ్లు పడ్డ తీవ్రతకు కరెంట్ తీగ తెగి సర్రున ఎగిరి పోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు..
‘బామ్మ పొద్దున్నే ఎవరి ముఖం చూసిందో.. ప్రాణాలతో బయటపడింది’..‘ఆ బామ్మను నిజంగా ఆ దేవుడే కాపాడాడు’..‘ఐదే ఐదు సెకన్లు తేడాతో ఇళ్లు కూలిపోయింది. లేదంటే దారుణం జరిగి ఉండేది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, భారీ వర్షాల కారణంగా ఉత్తర ప్రదేశ్‌లో గృహాలు, స్కూలు పైకప్పులు, భవంతులు కూలిపోతున్న సంఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు పది మందికి పైగా చనిపోయారు.
ఇవి కూడా చదవండి
అధికారంలోకి వచ్చాక.. రైతులకు 24 గంటలూ ఉచిత విద్యుత్
బరి తెగిస్తున్న కేటుగాళ్లు.. దేవుళ్లను కూడా వదలటం లేదు...
Updated Date - Aug 05 , 2025 | 11:57 AM