Fake Domicile Certificate: బరి తెగిస్తున్న కేటుగాళ్లు.. దేవుళ్లను కూడా వదలటం లేదు...
ABN , Publish Date - Aug 05 , 2025 | 10:37 AM
Fake Domicile Certificate: నిన్నటి వరకు జంతువుల్ని వాడుకున్న కేటుగాళ్లు ఇప్పుడు ఏకంగా దేవుళ్లనే వాడుకుంటున్నారు. తాజాగా, రాముడి పేరు మీద రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలంటూ అప్లికేషన్ వచ్చింది. ఆ అప్లికేషన్ మీద రాముడి ఫొటో చూసి అధికారులు అవాక్ అయ్యారు.
బిహార్ రాష్ట్రంలో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఫేక్ రెసిడెన్స్ సర్టిఫికేట్ల కోసం ఏకంగా దేవుళ్ల పేర్లను వాడుకుంటున్నారు. రెసిడెన్స్ సర్టిఫికేట్ కోసం వచ్చిన అప్లికేషన్లు చూసి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం ‘డాగ్ బాబు’ పేరిట కుక్కకు అధికారులు సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ సర్టిఫికేట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. వెంటనే వారు ఆ సర్టిఫికేట్‌ను క్యాన్సిల్ చేయించారు. ఆ సర్టిఫికేట్ జారీ చేసిన అధికారులను సస్పెండ్ చేశారు.
దేవుళ్ల పేరుతో అప్లికేషన్లు..
‘డాగ్ బాబు’ సంఘటన తర్వాత.. ‘డాగేశ్ బాబు’ సంఘటన కూడా చోటుచేసుకుంది. డాగేశ్ బాబు అనే కుక్క పేరుతో రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలంటూ గుర్తుతెలియని వ్యక్తులు అప్లికేషన్ పెట్టారు. ఆ అప్లికేషన్ చూసి అధికారులు షాక్ అయ్యారు. దాన్ని రిజెక్ట్ చేశారు. నిన్నటి వరకు జంతువుల్ని వాడుకున్న కేటుగాళ్లు ఇప్పుడు ఏకంగా దేవుళ్లనే వాడుకుంటున్నారు. తాజాగా, రాముడి పేరు మీద రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలంటూ అప్లికేషన్ వచ్చింది. ఆ అప్లికేషన్ మీద రాముడి ఫొటో చూసి అధికారులు అవాక్ అయ్యారు.
ఆ అప్లికేషన్‌లో.. రాముడి తండ్రి పేరు దశరథ్. తల్లి పేరు కౌసల్య. గ్రామం పేరు అయోధ్య అంటూ రామాయణంలోని వివరాలు నింపి అప్లికేషన్ పూర్తి చేశారు. సీత పేరు మీద మరో అప్లికేషన్ వచ్చింది. తండ్రి పేరు జనక. తల్లి పేరు సునైన. ఊరు అయోధ్య అని ఉంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే. సీత ఫోన్ నెంబర్‌గా 9999999999 రాశారు. అధికారులు ఇలాంటి అప్లికేషన్లను రిజెక్ట్ చేస్తున్నారు. ఆ అప్లికేషన్స్ పెట్టిన వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
ఎర్రకోటలో భద్రతా వైఫల్యం.. ఏడుగురు పోలీసుల సస్పెన్షన్
తాగుడికి బానిస.. కారులో శవమై తేలిన నటుడు