Actor Drink And Drive Case: తాగుడికి బానిస.. కారులో శవమై తేలిన నటుడు
ABN , Publish Date - Aug 05 , 2025 | 08:21 AM
Actor Drink And Drive Case: సోమవారం తెల్లవారుజామున యోగిన్ ప్రాంతంలోని ఓ రోడ్డుపై అతడి కారు ఆగి ఉంది. ఎంత సేపటికి కారు అక్కడినుంచి కదల్లేదు. దీంతో అక్కడి జనాలకు అనుమానం వచ్చింది. కారు దగ్గరకు వెళ్లారు. లోపల ఉన్న సాంగ్ యాంగ్‌ను పిలిచారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్టయిన కొన్ని రోజులకే ఓ నటుడు చనిపోయాడు. కారులో శవమై తేలాడు. ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ నటుడు సాంగ్ యాంగ్ క్యు మద్యానికి బానిస అయ్యాడు. కొద్దిరోజుల క్రితం తాగి కారు నడుపుతున్న ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయినా సాంగ్ యాంగ్‌లో మార్పు రాలేదు. బయటకు వచ్చిన తర్వాతి నుంచి విపరీతంగా మందు తాగటం మొదలెట్టాడు.
తాగి తన కారులో సిటీ మొత్తం చక్కర్లు కొట్టేవాడు. సోమవారం తెల్లవారుజామున యోగిన్ ప్రాంతంలోని ఓ రోడ్డుపై అతడి కారు ఆగి ఉంది. ఎంత సేపటికి కారు అక్కడినుంచి కదల్లేదు. దీంతో అక్కడి జనాలకు అనుమానం వచ్చింది. కారు దగ్గరకు వెళ్లారు. లోపల ఉన్న సాంగ్ యాంగ్‌ను పిలిచారు. అతడు పలకలేదు. ఎన్నిసార్లు పిలిచినా అతడు స్పందించక పోవటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కారు డోరు తీసి సాంగ్ యాంగ్‌ను పరీక్షించారు.
అతడు చనిపోయాడని ధ్రువీకరించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సాంగ్ యాంగ్ మరణానికి కారణాలు తెలియరావాల్సి ఉంది. పోస్టుమార్టం రిపోర్టు వస్తే మరణానికి అసలు కారణం తెలిసే అవకాశం ఉంది. కాగా, సాంగ్ యాంగ్ దాదాపు 30 ఏళ్ల పాటు కళారంగంలో సేవలు అందించారు. రంగస్థలం, టీవీ, సినిమా రంగాల్లో పని చేశారు. 2004లో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. పలు హిట్ చిత్రాల్లో నటించారు.
ఇవి కూడా చదవండి
భారత్‌పై మరింతగా పన్నులు పెంచుతా.. డొనాల్డ్ ట్రంప్ మరోసారి బెదిరింపు..
వీడు మామూలోడు కాదు.. మృత్యువుకు హాయ్ చెప్పి వచ్చాడు..