Share News

Recording Lion With Prey: వీడు మామూలోడు కాదు.. మృత్యువుకు హాయ్ చెప్పి వచ్చాడు..

ABN , Publish Date - Aug 05 , 2025 | 07:37 AM

Recording Lion With Prey: సింహాన్ని వీడియో తీయటం మొదలెట్టాడు. తర్వాత మెల్లగా సింహం దగ్గరకు నడుచుకుంటూ వెళ్లాడు. మనిషిని చూడగానే ఆ సింహానికి కోపం వచ్చింది. అతడిని భయపెట్టడానికి మీదకు పరుగులు తీసింది.

Recording Lion With Prey: వీడు మామూలోడు కాదు.. మృత్యువుకు హాయ్ చెప్పి వచ్చాడు..
Recording Lion With Prey

పిచ్చి పలు రకాలు అన్నట్లు. కొంతమంది ప్రవర్తన చూస్తుంటే మనకు పిచ్చెక్కిపోతుంది. ఇందుకు ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటనే ఓ ప్రత్యక్ష ఉదాహరణ. ఓ వ్యక్తి వీడియో తీసే పిచ్చిలో ప్రాణాలను రిస్క్‌లో పెట్టాడు. ఏకంగా సింహం దగ్గరకు వెళ్లిపోయాడు. అదృష్టం బాగుండి బతికి బయటపడ్డాడు. ఈ సంఘటన గుజరాత్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. భావ్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి అటవీ ప్రాంతంలోని రోడ్డుపై బైకుపై వెళుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఓ చోట సింహం అడవి బర్రెను చంపి తింటూ ఉంది.


అతడు వెంటనే బైకు ఆపాడు. సింహాన్ని వీడియో తీయటం మొదలెట్టాడు. తర్వాత మెల్లగా సింహం దగ్గరకు నడుచుకుంటూ వెళ్లాడు. మనిషిని చూడగానే ఆ సింహానికి కోపం వచ్చింది. అతడిని భయపెట్టడానికి మీదకు పరుగులు తీసింది. అయితే, అతడు ఏ మాత్రం భయపడకుండా.. వెనక్కు తిరిగిపరిగెత్తకుండా చాకచక్యంగా వ్యవహరించాడు. కొంత దూరం వెనక్కు అడుగులు వేశాడు. ఆ సింహం అతడిని వెంట పడలేదు. అక్కడే ఆగిపోయింది. అతడు అక్కడినుంచి వెళ్లిపోయాడు.


ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు. వాటిని వాటి మానాన వదిలేయకుండా ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు బ్రో’.. ‘ఆ సింహం ఎక్కువ కోపం తెచ్చుకోలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే లంచ్‌తో పాటు డిన్నర్ కూడా ఒకే సారి చేసేది’..‘నువ్వు మనిషివా మరణ మృగానివా. హాయిగా అది తింటుంటే డిస్ట్రబ్ చేస్తావ్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

చనిపోయిన మహిళ అకౌంట్లో లక్ష కోట్లు డిపాజిట్.. షాక్ అయిన కొడుకు..

కేకే రైలు మార్గంపై పడిన కొండ చరియ

Updated Date - Aug 05 , 2025 | 07:44 AM