KK Railway Line: కేకే రైలు మార్గంపై పడిన కొండ చరియ
ABN , Publish Date - Aug 05 , 2025 | 06:49 AM
కేకే కొత్తవలస కిరండూల్ రైలు మార్గంలో అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం బొర్రా చిమిడిపల్లి
రైళ్ల రాకపోలకు అంతరాయం
అనంతగిరి, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): కేకే (కొత్తవలస-కిరండూల్) రైలు మార్గంలో అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం బొర్రా-చిమిడిపల్లి స్టేషన్ల మధ్య సోమవారం టన్నెల్ 32బీ సమీపంలో ఉన్న బ్రిడ్జిపై పక్కనున్న కొండ పైనుంచి భారీ బండరాయి ఒకటి జారిపడింది. దీంతో పట్టాలు, ఓహెచ్‌సీ కేబుల్ దెబ్బతిన్నాయి. దీంతో రైళ్ల రాకపోలకు అంతరాయం ఏర్పడింది. యుద్ధప్రతిపాదికన రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతు పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ ఘటన నేపథ్యంలో కిరండూల్ నుంచి విశాఖపట్నం వెళుతున్న పాసింజర్ రైళ్లను అరకులోయ మండలం కరకవలస వద్ద నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.