Viral Video: చదువుకోసం చిన్నారుల సాహసం.. ప్రాణాలకు తెగించి..
ABN, Publish Date - Jul 04 , 2025 | 06:57 AM
Viral Video: విద్యార్థులు నది మార్గం ద్వారా ప్రయాణం చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో విద్యార్థులు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని.. భయపడుతూ.. అడుగులో అడుగు వేసుకుంటూ నది దాటుతున్నారు.
చదువు మనిషికి ఓ అవసరం మాత్రమే. అదే జీవితం కాదు. మనషి జీవితంలో ఓ భాగం మాత్రమే అయిన చదువు కోసం ప్రాణాలకు తెగించాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. మహారాష్ట్రకు చెందిన కొంతమంది స్కూలు పిల్లలు మాత్రం స్కూలుకు వెళ్లడానికి తమ ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్నారు. ప్రమాదకరంగా ఉన్న నదిని దాటుతున్నారు. వారు కొంచెం అదుపు తప్పినా ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఒక చిన్న తప్పిదం వారందరి ప్రాణాలు తీసే అవకాశం ఉంది.
ఇక, ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర, పాల్‌ఘర్ జిల్లాలో నకడ్ పాడ అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే గర్‌గావ్ అనే గ్రామంలో ఆశ్రమ్ స్కూలు ఉంది. నకడ్ పాడ గ్రామానికి చెందిన చాలా మంది పిల్లలు ఆ స్కూలులోనే చదువుతున్నారు. ఈ ఊరు నుంచి స్కూలు ఉన్న ఊరికి రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలంటే ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. అదే నది దాటి వెళితే రెండు కిలోమీటర్లు ప్రయాణం చేయాలి.
అందుకే విద్యార్ధులు నది దాటి స్కూలుకు వెళుతుంటారు. సాధారణ సమయాల్లో ఆ మార్గం బాగానే ఉంటుంది. కానీ, వర్షాకాలంలో నీటి ప్రవాహం పెరుగుతుంది. నది మీద ప్రయాణం ప్రమాదకరంగా మారుతుంది. అయినా విద్యార్థులు మాత్రం ఆ మార్గాన్నే ఎంచుకుంటున్నారు. తమ ప్రాణాలను రిస్క్‌లో పెట్టుకుంటున్నారు. విద్యార్థులు నది మార్గం ద్వారా ప్రయాణం చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో విద్యార్థులు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని.. భయపడుతూ.. అడుగులో అడుగు వేసుకుంటూ నది దాటుతున్నారు. వారిలో ఒక్కరు తప్పు చేసినా అందరి ప్రాణాలు పోయే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
ఉత్తమ వీడియోగ్రఫీ, ఫొటోగ్రఫీ పోటీలు
Updated Date - Jul 04 , 2025 | 07:26 AM