Share News

Photography Contest: ఉత్తమ వీడియోగ్రఫీ, ఫొటోగ్రఫీ పోటీలు

ABN , Publish Date - Jul 04 , 2025 | 06:08 AM

తెలంగాణ సంస్కృతి-సంప్రదాయాలు, వారసత్వ వైభవాన్ని ప్రతిబింబించేలా ఫొటోలు, వీడియోలు తీసినవారికి నగదు పురస్కారాన్ని అందించనున్నట్టు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ వల్లూరి క్రాంతి తెలియజేశారు.

Photography Contest:  ఉత్తమ వీడియోగ్రఫీ, ఫొటోగ్రఫీ పోటీలు

  • 27లోగా ఎంట్రీలు : పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ

తెలంగాణ సంస్కృతి-సంప్రదాయాలు, వారసత్వ వైభవాన్ని ప్రతిబింబించేలా ఫొటోలు, వీడియోలు తీసినవారికి నగదు పురస్కారాన్ని అందించనున్నట్టు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ వల్లూరి క్రాంతి తెలియజేశారు. వచ్చే ఆగస్టులో హైదరాబాద్‌లో జరగనున్న పర్యాటక కాంక్లేవ్‌ కోసం ఈ ఫొటోలను వినియోగించనున్నట్టు తెలిపారు. ఆసక్తి కలవారు జూలై 27లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.


తెలంగాణ పల్లె జీవనం, ప్రకృతి సౌందర్యం, చారిత్రాత్మక నిర్మాణాలు, పండుగలు, సంప్రదాయ వృత్తులు తదితర అంశాలను ప్రధానంగా పరిశీలనలోకి తీసుకుంటామని ఎండీ వల్లూరి క్రాంతి వివరించారు. వీడియో గ్రాఫర్‌లకు ప్రథమ బహుమతిగా రూ. 10వేలు, ద్వితీయ బహుమతిగా రూ.5వేలు, తృతీయ బహుమతిగా రూ.3వేలు నగదు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అలాగే ఉత్తమ ఫొటో గ్రాఫర్‌లకు ప్రథమ బహుమతిగా రూ. 4వేలు, రెండో బహుమతిగా రూ. 3వేలు, మూడో బహుమతిగా రూ. 2వేలు నగదు అందించనున్నట్టు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు పర్యాటక సంస్థ వెబ్‌సైట్‌ https://tourism.telangana.gov.in సందర్శించాలని సూచించారు.

Updated Date - Jul 04 , 2025 | 06:08 AM