ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆ ఆఫీసులో పిల్లులూ ఉద్యోగులే...

ABN, Publish Date - May 18 , 2025 | 02:06 PM

‘ఈరోజు ఆఫీసులో ఆడిటింగ్‌ నడుస్తోంది...’, ‘క్లయింట్స్‌తో మీటింగ్‌లు ఉన్నాయి..’లాంటి మాటలు ప్రతి ఆఫీసులో మామూలే. కానీ, ‘మా ఆఫీసులో పిల్లికి పాలు తాగించాలి, ఆడించాలి’, ‘మా ఆఫీసు పిల్లి కొలీగ్స్‌ వల్ల టెన్షన్‌ అంతా హుష్‌కాకి’... ఇలాంటి మాటలు ఎక్కడైనా విన్నారా? ఆఫీసులో పిల్లులు... వినడానికే కొత్తగా ఉన్నా... జపాన్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ దీనిని నిజం చేసి చూపెడుతోంది.

పిల్లులను అమితంగా ఇష్టపడే దేశం జపాన్‌. ఆ దేశంలో పిల్లుల కోసం ‘క్యాట్‌ కెఫేలు’, పిల్లులతో కలిసి ఉండడానికి అనుమతించే హోటళ్లు సర్వసాధారణం. పిల్లులను అదృష్టదేవతలుగా, సంరక్షకులుగా జపనీయలు భావిస్తారు. వాళ్ల సంస్కృతిలో పిల్లులు కూడా ఓ భాగం. అయితే వీటన్నిటికంటే ఓ అడుగు ముందుకేసి పిల్లులకు ఉద్యోగాలిచ్చి, పెంచి పోషిస్తోంది ‘క్యూనోట్‌’ అనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీ.

టెన్షన్‌ మటుమాయం...

నేటి ఉద్యోగాల్లో ఒత్తిడి, ఆందోళన ఎంతగా ఉంటోందో అందరికీ తెలిసిందే. క్షణం తీరిక లేకుండా ఆఫీసు వ్యవహారాలు చక్కదిద్దాలంటే ఎవరికైనా అలసటగానే అనిపిస్తుంది. అందుకే నలభైలలోనే ఉద్యోగులు మరో పదేళ్లు అంటే యాభైలలో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. జీవితంలో సగభాగం ఆఫీసుల్లోనే గడిచి పోతోంది. అయితే పెట్స్‌తో ఫ్రెండ్లీగా ఉంటే అలసట పోతుందనే సైకాలజీ కూడా ఉంది. కాబట్టి ఆఫీసుల్లో పెట్స్‌ను అనుమతిస్తే అక్కడి వాతావరణం పూర్తిగా మారిపోతుందనే అభిప్రాయం గత కొంతకాలంగా చక్కర్లు కొడుతోంది. ‘క్యూనోట్‌’ సంస్థ అధ్యక్షుడు నొబుయుకీ తురుతా ఈ అభిప్రాయాన్ని నిజమేనని నిరూపిస్తున్నారు. వెబ్‌ డిజైనింగ్‌తో పాటు యాప్స్‌ను అభివృద్ధి చేసే సంస్థ ఇది. టోక్యోలోని సుగినామీ వార్డులో క్యూనోట్‌ ఉంది. నాలుగు అంతస్తుల క్యూనోట్‌ ఆఫీసు తాజాగా ‘క్యాట్‌ భవనం’గా పేరుతెచ్చుకుంది.


ఉద్యోగులు 50... పిల్లులు 11...

క్యూనోట్‌లో ఉద్యోగుల సంఖ్య యాభై లోపే. అయితే ఉద్యోగి మార్జాలాల సంఖ్య 11. ఇవన్నీ కూడా ఫుల్‌టైమ్‌ ఉద్యోగులే. ఈ మార్జాలాలు అన్నింటి లోకి పెద్దది ఫుతాబా. ఈ పిల్లి వయసు అక్షరాలా ఇరవై ఏళ్లు. అక్కడిపిల్లుల్లో ఆరు ఫుతాబాకి పుట్టినవే. మిగతా పిల్లుల్లో ఒకదాన్ని రోడ్డు ప్రమాదంలోసంరక్షించారు. క్యాట్‌ కెఫే నుంచి ఓ పిల్లిని దత్తత తీసుకున్నారు. మరొకటి వీధి పిల్లి. మిగతా పిల్లులు కొందరు ఉద్యోగులవి. అయితే ఉద్యోగులందరిలోకి సీనియర్‌ ఫుతాబానే. దాన్ని ఓ సుఫీ రెస్టారెంట్‌ నుంచి దత్తత తీసుకున్నారు తురుతా. ఈ పిల్లుల్లో ఎనిమిది ఆఫీసులోనే నివసిస్తాయి. మిగతావి సాయంత్రం కాగానే తమ యజమానులతోపాటు ఇళ్లకి వెళతాయి.


ఆఫీసులో స్వేచ్ఛగా...

మొదటి నుంచి కూడా క్యూనోట్‌లో ఉద్యోగులకు ఎలాంటి నియమనిబంధనలు లేకుండా పూర్తి స్వేచ్ఛగా నడిపించాలన్నది తురుతా ఉద్దేశం. అక్కడి ఉద్యోగస్తులు అందరూ కూడా పెట్స్‌ ప్రియులే. ఆ కంపెనీలో చేరాలని అనుకున్నవాళ్లకి ప్రధానంగా ఉండాల్సిన లక్షణం కూడా అదే. పిల్లుల అవసరాలకు తగినట్టుగా క్యూనోట్‌ ఆఫీసు భవన నిర్మాణం చేశారు. గోడలకు వాల్‌ పేపర్లకు బదులుగా దళసరి పెయింట్‌ను వేశారు. పిల్లులు గోళ్లతో గీరినా గోడలు చెడిపోవు. రెండు అంతస్తుల క్యూనోట్‌ భవనంలో 12 క్యాట్‌ టాయిలెట్లని ఏర్పాటుచేయడం విశేషం. అవి సాఫీగా నడుచుకుంటూ వెళ్లేందుకు దారులు ఏర్పరిచారు.


పిల్లులకు హాని కలిగించే వస్తువులను ఉంచకుండా ఎప్పటికప్పుడు ఉద్యోగస్తులు జాగ్రత్త పడుతుంటారు. మార్జాలాల సంరక్షణలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకుంటారు. ఈ ప్రయోగం వల్ల ఉద్యోగస్తులో ఆత్మీయ అనుబంధాలు పెరిగి, ఆఫీసు పనులూ వేగవంతం అవుతున్నాయట. పిల్లులు అటూ ఇటూ తిరుగుతూ డెస్క్‌ దగ్గరికి వచ్చినా ఎవరూ చిరాకు పడకుండా వాటితో సరదాగా గడుపుతారు. ఉద్యోగ పిల్లులు ‘మ్యావ్‌ మ్యావ్‌’ అంటూ ఆఫీసంతా కలియ తిరుగుతుంటాయి. ‘మా కంపెనీ లాభాల్లో నడుస్తోంది. క్యూనోట్‌కు ఉద్యోగ దరఖాస్తులూ పెరుగుతున్నాయి. అదృష్టం, సంతోషంతో పాటు ఉద్యోగులనూ మా కంపెనీకి ఈ పిల్లులే తీసుకువస్తున్నాయ’ని మురిసిపోతున్నారు సంస్థ అధ్యక్షుడు.


ఈ వార్తలు కూడా చదవండి.

Crocodile Attack: రైతును నీళ్లలోకి లాక్కెళ్లిన మొసలి

Rajanna Sircilla: సిరిసిల్లలో మరో నేతన్న ఆత్మహత్య

తొమ్మిది నెలల క్రితమే వివాహం.. విషాదంలో శ్రీధర్ కుటుంబం

MP Arvind:కాంగ్రెస్‌వి ఓటు బ్యాంకు రాజకీయాలు

Read Latest Telangana News and National News

Updated Date - May 18 , 2025 | 02:06 PM