ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Canada Indian Couple: వాళ్ల దేశాన్ని టాయిలెట్‌లా చేసుకున్నారు.. భారతీయులపై కెనడా మహిళ ఆగ్రహం

ABN, Publish Date - Jul 15 , 2025 | 11:30 PM

కెనడాలో ఇద్దరు భారతీయులు వీధి పక్కన పొదల్లో చెత్త పారేస్తున్నట్టు ఉన్న వీడియో వైరల్‌గా మారింది. లక్షల కొద్దీ వ్యూస్ వస్తున్న ఈ వీడియోపై జనాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Indian couple Canada backlash

ఇంటర్నెట్ డెస్క్: కెనడాలో ఓ భారతీయ జంట రోడ్డు పక్కన చెత్త వేస్తున్నట్టు కనిపిస్తున్న వైనం ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది. డెబ్బీ అనే మహిళ మొదట ఈ వీడియోను నెట్టింట పంచుకుంది. అంతేకాకుండా, భారతీయులపై మండిపడింది. ఆమె కామెంట్స్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి.

‘వీళ్లు తమ దేశాన్ని టాయిలెట్‌లా మార్చుకున్నారు. ఇప్పుడు కెనడాను కూడా ఇలాగే చేస్తున్నారు. ఈ దృశ్యాల్ని వీడియో తీస్తూ ఉండకపోతే వారిని అడ్డుకోవచ్చు కదా’ అంటూ ఆమె వీడియోను షేర్ చేసింది.

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ మహిళ, పురుషుడు రోడ్డు పక్కన కారు ఆపారు. ఆ తరువాత తమ ప్లాస్టిక్ కవర్లలోంచి ఏవో కొన్ని తీసి పొదల్లో విసిరేస్తున్నట్టు కనిపించారు. ప్లాస్టిక్ బ్యాగుల్లో ఉన్నవేంటనేదానిపై మాత్రం స్పష్టత రాలేదు.

ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తోంది. కొందరు ఆ జంట తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కెనడా మీరు చెత్త పారేసే డంపింగ్ యార్డ్ కాదు. కాస్త మర్యాదగా నడుచుకోండి. పర్యావరణం కోసం ఆలోచించండి’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు.

మరి కొందరు మాత్రం ఆ జంటపై విమర్శలను ఖండించారు. జాత్యాహంకార ధోరణి తగదంటూ హితవు పలికారు. అసలేం జరిగిందో పూర్తిగా తెలుసుకోకుండా తొందరపాటు అంచనాలకు రావొద్దని మరికొందరు చెప్పారు. అక్కడి పక్షులు లేదా ఇతర జంతువులకు వారు ఆహారం పెడుతూ ఉండొచ్చని అన్నారు. అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోకుండా వీడియోలోని వారిని తప్పుబట్టడం లేదా ఇండియన్లు ఇంతే అంటూ అందరినీ ఒకేగాటన కట్టడం తప్పని అన్నారు.

అసలేం జరిగిందనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. స్థానిక అధికారులు ఈ విషయంపై స్పందించలేదు. వీడియోలోని వ్యక్తులు కూడా ఈ వైరల్ ఉదంతంపై స్పందించలేదని తెలుస్తోంది. ఇక వీడియో మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది. లక్షల కొద్దీ వ్యూస్ వచ్చి పడుతున్నాయి. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

ఇవీ చదవండి:

ఈ పని మాత్రం అస్సలు చేయొద్దు.. హెచ్‌1బీ వీసాదారులకు నెటిజన్ సూచనపై పెద్ద చర్చ

జీతంలో 50 శాతం పన్నులకే.. ఐరోపా లైఫ్‌పై ఎన్నారై పోస్టు వైరల్

Read Latest and Viral News

Updated Date - Jul 16 , 2025 | 12:03 AM