ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: శుభమా అని పెళ్లి చేసుకోబోతూ ఇదేం పని..

ABN, Publish Date - May 12 , 2025 | 07:55 AM

Viral Video: వధూవరులకు సంబంధించిన స్టంట్ వీడియో గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో అటు తిరిగి, ఇటు తిరిగి ట్రాఫిక్ అధికారుల దృష్టికి కూడా వెళ్లింది. వీడియోపై విచారణ చేసిన అధికారులు వధూవరులకు షాక్ ఇచ్చారు.

Viral Video

ఈ మధ్య కాలంలో ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ ఫొటో, వీడియో షూట్ల పేరుతో జంటలు రెచ్చిపోతున్నాయి. వింత, విచిత్ర, ప్రమాదకరమైన పనులు చేస్తున్నాయి. పెళ్లి వేడుకను గుర్తుండిపోయేలా చేసుకోవాలన్న ఇదిలో.. జంటలు ప్రాణాలు బలి చేసుకుంటున్నాయి. ప్రీ వెడ్డింగ్ షూట్ నేపథ్యంలో ప్రాణాలు కోల్పోయిన జంటలు కూడా ఉన్నాయి. తాజాగా, ఓ వధూవరుల జంట దుస్సాహసానికి పాల్పడింది. కారుపై ప్రమాదకరమైన స్టంట్ చేసి, చిక్కుల్లో పడింది. ట్రాఫిక్ పోలీసులు వారికి సరైన విధంగా బుద్ధి చెప్పారు.


ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్య ప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ఓ జంటకు కొద్దిరోజుల క్రితం పెళ్లయింది. పెళ్లికి ముందు ఆ జంట ఓ పిచ్చి పని చేసింది. వధూవరులు ఇద్దరు కలిసి కారుపై ప్రమాదకరమైన స్టంట్ చేశారు. కారు రన్నింగ్‌లో ఉంది. వరుడు కారుపై నిలబడి ఖడ్గం తిప్పుతూ ఉన్నాడు. వధువు కారు బోనెట్‌పై కూర్చుని ఉంది. ఆమె ‘ ఇస్క్‌కి గలి విచ్ నో ఎంట్రీ ’ పాటకు తగ్గట్టు తన శరీరాన్ని ఆడిస్తూ ఉంది. రైల్ ఓవర్ బ్రిడ్జి దగ్గర ఈ సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.


ఈ వీడియో అటు తిరిగి, ఇటు తిరిగి ట్రాఫిక్ అధికారుల దృష్టికి కూడా వెళ్లింది. వీడియోపై విచారణ చేసిన అధికారులు వధూవరులకు షాక్ ఇచ్చారు. కారుకు పెద్ద మొత్తంలో ఫైన్ వేశారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. ఆ జంటపై మరిన్ని చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీస్ అధికారి సుబేదార్ అభిషేక్ రఘువంశీ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘ ఆ స్టంట్ కారణంగా కేవలం వారి ప్రాణాలకే కాదు.. రోడ్డుపై వెళ్లే వారికి కూడా ప్రమాదమే’ అని అన్నారు. కారుపై ప్రమాదకరమైన స్టంట్ చేసిన ఆ జంటకు ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి శిక్ష విధిస్తారో తెలియాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి

Teacher: స్కూలు పిల్లలతో టీచర్ ఎఫైర్.. బహుమతులు ఇచ్చి..

Gold Rate Today: బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. తగ్గిన ధరలు

Updated Date - May 12 , 2025 | 08:28 AM