ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Crocodile Video: ఆ గుండెకు ధైర్యం ఎక్కువే.. నీటిలోనే మొసళ్లను ఎలా పరిగెత్తించాడో చూడండి..

ABN, Publish Date - Jun 23 , 2025 | 07:04 PM

నీటిలో మొసళ్లు అత్యంత బలమైనవి. ఎంత పెద్ద జంతువు అయినా నీటిలోకి వెళ్లి మొసలి నోటికి చిక్కిందంటే అది తన ప్రాణం మీద ఆశ వదిలేసుకోవాల్సిందే. అలాంటిది ఒక మొసలికి కాదు.. మొసళ్ల గుంపునకు ఓ వ్యక్తి దిమ్మదిరిగే షాకిచ్చాడు. నీటిలోని మొసళ్ల గుంపును పరుగులు పెట్టించాడు.

Crocodiles viral video

నీటిలో మొసళ్లు (Crocodiles) అత్యంత బలమైనవి. ఎంత పెద్ద జంతువు అయినా నీటిలోకి వెళ్లి మొసలి నోటికి చిక్కిందంటే అది తన ప్రాణం మీద ఆశ వదిలేసుకోవాల్సిందే. అలాంటిది ఒక మొసలికి కాదు.. మొసళ్ల గుంపునకు ఓ వ్యక్తి దిమ్మదిరిగే షాకిచ్చాడు. నీటిలోని మొసళ్ల గుంపును పరుగులు పెట్టించాడు. ఆ వీడియో (Crocodile Video) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన వారు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

@AMAZlNGNATURE అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఆ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి బోటు (Boat) వేసుకుని ఓ చెరువులో వేగంగా ప్రయాణిస్తున్నాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఆ చెరువులో ఓ చోట మొసళ్ల గుంపు కనబడింది. అయినా ఆ వ్యక్తి తన బోటును ఆపలేదు. ఆ మొసళ్ల మీదుగానే పోనిచ్చాడు. దీంతో ఆ మొసళ్లు అన్నీ అక్కడి నుంచి పరుగులు పెట్టాయి. ఆ చెక్క బోటు కొంచెం చిన్నాగానే ఉంది. ఆ బోటుతోనే ఎంతో ధైర్యంగా ముందుకెళ్లిన ఆ వ్యక్తి పదుల సంఖ్యలో ఉన్న మొసళ్లను చెల్లాచెదురు చేశాడు.

ఆ వీడియోను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు ఆరు లక్షల మంది వీక్షించారు. 7.7 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఎన్ని కోట్లు ఇచ్చినా అలాంటి ప్రాంతానికి తాను వెళ్లబోనని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. అతడి గుండెకు చాలా ధైర్యం అని మరొకరు కామెంట్ చేశారు.

ఇవి కూడా చదవండి..

వామ్మో.. ఆ కోబ్రా ఎలా నిల్చుందో చూశారా.. వీడియో చూస్తే షాకవడం ఖాయం..

మొసలితో పెట్టుకునే ముందు ఆలోచించాల్సిందే.. వీడియో కోసం స్టంట్ చేయాలనుకుంటే..

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 23 , 2025 | 08:49 PM