Union Budget 2025: ఇది కేంద్ర బడ్జెట్టా? బీహార్ బడ్జెట్టా: కాంగ్రెస్ మండిపాటు
ABN, Publish Date - Feb 01 , 2025 | 02:50 PM
బీహార్ అసెంబ్లీ ఎన్నికల సంవత్సరాన్ని పురస్కరించుకుని సహజంగానే ఆ రాష్ట్రంపై బీజేపీ ప్రేమ కురిపించిందని జైరామ్ రమేష్ అన్నారు. 2025-2026 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ పార్లమెంటులో శనివారంనాడు ప్రవేశపెట్టారు.
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ (Union Budget 2025)లో రాష్ట్రాలకు కేటాయింపులపై కాంగ్రెస్ ప్రతినిధి జైరామ్ రమేష్ (Jairam Ramesh) పెదవి విరిచారు. ఎన్డీయేలో కీలక భాగస్వాములుగా ఉన్న బీహార్ (Bihar)కు కేటాయింపుల్లో పెద్దపీట వేశారని, ఆంధ్రప్రదేశ్ (Andrha Pradesh)ను దారుణంగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సంవత్సరాన్ని పురస్కరించుకుని సహజంగానే ఆ రాష్ట్రంపై బీజేపీ ప్రేమ కురిపించిందని అన్నారు. 2025-2026 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ పార్లమెంటులో శనివారంనాడు ప్రవేశపెట్టారు.
Budget 2025: కేంద్ర బడ్జెట్ 2025.. బీహార్‌పై వరాల జల్లు..
''ఎన్నికల సంవత్సరమైనందున బీహార్‌పై వరాల జల్లులు కురిపించారు. ఎన్డీయే సర్కార్‌కు మరో కీలక స్తంభమైన ఆంధ్రప్రదేశ్‌ను ఎందుకు అంత దారుణంగా నిర్లక్ష్యం చేశారు?'' అని జైరామ్ రమేష్ ప్రశ్నించారు. ప్రైవేటు పెట్టుబడలు తగ్గుముఖం పట్టం, జీఎస్‌టీ సిస్టం సంక్లిష్టతలను బడ్జెట్ పట్టించుకోలేదని, ఆదాయం పన్ను వర్గాలకు మాత్రమే ఊరట లభించిందని అన్నారు. అయితే ఆర్థిక వ్యవస్థపై దీని వాస్తవ ప్రభావం ఏవిధంగా ఉంటుందో చూడాల్సి ఉంటుందన్నారు.
ఇది కేంద్ర బడ్జెట్టా? బీహార్ బడ్జెట్టా?
ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మనీష్ తివారీసైతం విమర్శలు గుప్పించారు. ఇది భారత ప్రభుత్వ బడ్జెట్టా? బీహార్ బడ్జెట్టా అనేది అర్ధం కాలేదన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి పూర్తి ప్రసంగంలో బీహార్ మినహాయిస్తే మరో రాష్ట్రం పేరు వినిపించిందా? అని ప్రశ్నించారు.
బీహార్‌లో రైతుల కోసం మఖానా బోర్డు ఏర్పాటు చేస్తామని, మిథిలాంచల్ ప్రాంతంలో 50,000 ఎకరాలకు ప్రయోజనం చేకూర్చే వెస్టర్న్ కోసి కెనాల్‌తు ఆర్థిక సాయం అందిస్తామని బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పాట్నా ఐఐటీని విస్తరిస్తామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్‌కు మద్దతు ఇచ్చేందుకు బీహార్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సివిల్ ఏవియేషన్ పుష్‌లో భాగంగా గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అధివృద్ధికి రూ.15,000 కోట్లు ఇస్తామని బడ్జెట్‌లో ప్రకటించగా, బీహార్‌లో రోడ్ ప్రాజెక్టులు, కొత్త ఎయిర్‌పోర్టులు, స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ.26,000 కోట్లు, ఫ్లడ్ మిటిగేషన్ కోసం రూ.11,500 కోట్లు ఇస్తామని ప్రకటించారు.
Budget 2025: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం.. ముఖ్యాంశాలు ఇవే
Artificial Intelligence: బడ్జెట్‌లో AIకి ప్రాధాన్యత.. రూ. 500 కోట్ల కేటాయింపు..
Union Budget For Start-Ups: బడ్జెట్‌లో స్టార్టప్‌లకు సూపర్ న్యూస్.. లక్షల వర్షం
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Feb 01 , 2025 | 03:19 PM