ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అతని ఆశయం.. చెరువంత..

ABN, Publish Date - Jul 13 , 2025 | 11:20 AM

చెరువుల్ని ఎవరు బాగు చేయాలి? మనమే సంరక్షించుకోవాలి. మనమే మళ్లీ వాటికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలి.. అలాంటి మనలో ఒకడు ముందుకొచ్చాడు. అతనే కర్ణాటకకు చెందిన ఆనంద్‌ మల్లిగవాడ్‌. బెంగళూరుతో మొదలైన చెరువుల పునరుద్ధరణను దేశవ్యాప్తంగా విస్తరింపజేశాడాయన...

చెరువుల్ని ఎవరు బాగు చేయాలి? మనమే సంరక్షించుకోవాలి. మనమే మళ్లీ వాటికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలి.. అలాంటి మనలో ఒకడు ముందుకొచ్చాడు. అతనే కర్ణాటకకు చెందిన ఆనంద్‌ మల్లిగవాడ్‌. బెంగళూరుతో మొదలైన చెరువుల పునరుద్ధరణను దేశవ్యాప్తంగా విస్తరింపజేశాడాయన...

‘‘2030 నాటికి దేశంలోని 21 నగరాల్లో తీవ్రమైన నీటికొరత రానుంది. ముఖ్యంగా బెంగళూరులో తాగునీటి కొరత మరింత సమస్యగా మారే ప్రమాదం ఉంది. ఒకప్పుడు నగరంలో వెయ్యికి పైగా చెరువులు ఉండేవి. 1960 వచ్చేనాటికి 290 మాత్రమే మిగిలాయి. ఇప్పుడైతే ఆ సంఖ్య కూడా మాయమై.. కేవలం 90 చెరువులకే పరిమితం అయ్యింది..’’

ఆనంద్‌ మల్లిగవాడ్‌.. పొద్దునే నిద్రలేచి.. దినపత్రిక చేతిలోకి తీసుకోగానే కట్టిపడేసిన కథన సారాంశం అది. ‘‘మన పూర్వీకులు మనకు అందించిన అద్భుత జలవనరుల్ని ఇలా నాశనం చేసుకోవడం ఎంత దారుణం’’ అనుకున్న ఆనంద్‌లో అంతర్మథనం మొదలైంది. వెంటనే బెంగళూరుతోపాటు దేశవ్యాప్తంగా పలు నగరాల్లోని చెరువుల లెక్కల్ని తేల్చే పనిలో మునిగిపోయాడు. ఒకప్పుడు ఎన్ని ఉండేవి? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఎందుకీ పరిస్థితి? చిన్నపాటి అధ్యయనం చేశాడు ఆనంద్‌.

ఊరి చెరువే నేర్పింది..

ఉత్తర కర్ణాటక, కొప్పాల్‌ జిల్లాలోని ఒక చిన్నపల్లెటూర్లో పుట్టి పెరిగాడు ఆనంద్‌. సహజంగా గ్రామీణ పిల్లలకున్న బాల్య జ్ఞాపకాలే ఆయనవి!. ‘‘ఎందుకో చిన్నప్పటి నుంచీ నాకు చదువుపైన శ్రద్ధ ఉండేది కాదు. దానికి కారణం? మా ఊరి పక్కనున్న చెరువు. పొద్దున లేచింది మొదలు సాయంత్రం వరకు అన్నం, నీళ్లు లేకుండా ఆ చెరువులో ఈత కొట్టేవాణ్ణి. తోటి పిల్లలతో కలిసి చెరువులోని మెత్తటి బంకమట్టి, ఇసుక లతో చిన్న చిన్న ఆనకట్టలు కట్టి, కాలువల్లా తయారుచేసి ఆనందించేవాళ్లం. అలా నా బాల్యమంతా చెరువుతోనే సాగింది.

ఎక్కడ చెరువు కనిపించినా మా ఊరే గుర్తుకొచ్చేంత భావోద్వేగ బంధం అల్లుకుపోయింది’’ అని పేర్కొన్నాడు ఆనంద్‌. అందుకే కను మరుగైపోతున్న చెరువుల గురించి పత్రికలో రాసిన కథనం ఆయనను ఆకర్షించింది. ఆలోచింపజేసింది. ఆనంద్‌ ఆ రోజు నుంచీ ఊరికే ఉండలేదు. చెరువుల్ని అధ్యయనం చేశాడు. వాటి చుట్టూ ఉన్న ఆక్రమణల్ని తొలగించి, మట్టి పూడిక తీయించి, కంపచెట్లు నరికేసి.. చెరువులకు పూర్వ వైభవం తీసుకురావాలనుకున్నాడు. ముందుగా తను చదువుతున్న సన్సెరా ఇంజనీరింగ్‌ కాలేజీ యాజమాన్యానికి తన ఆలోచన చెప్పాడు. ‘‘మీరు ఎంచుకున్న మార్గం భవిష్యత్తు తరాలకు ఎంతో ఉపయోగం. మా సహాయం మీకుంటుంది’’ అని ప్రోత్సహించారు.

బెంగళూరుతో పాటు...

చెరువుల్ని సంరక్షించడం, పునరుద్ధరించడం ఒకరి వల్ల అయ్యే పని కాదు. అధికారులు, స్థానికులు, కార్పొరేట్‌ సంస్థల సహకారం.. సమష్టి కృషితోనే ముందుకెళ్లాలని ఆనంద్‌ నిర్ణయించుకున్నాడు. తమ కాలేజీ అందించిన ఆర్థిక సహాయంతో బెంగళూరులోని క్యాలసన హల్లి చెరువును బాగు చేశాడు. ఇప్పుడా చెరువు చుట్టూ మూడువేల పండ్ల చెట్లు పెరిగాయి. అనేక పక్షులు వలసొచ్చి గూళ్లు నిర్మించుకున్నాయి. ఒక పర్యావరణ ఆవాసంలా మారిందా ప్రాంతం.

ఇలా పలు సంస్థలు అందించిన ఆర్థిక సహాయంతో ఒక్కోచెరువును బాగు చేసుకుంటూ ముందుకెళ్లాడు ఆనంద్‌. బెంగళూరులోని నంజాపురా, వబసంద్ర, బింగి పుర, కోనసంద్ర, గావి, మానె, హడోసిద్దపుర, చిక్కనాగమంగళ వంటి అనేక చెరువుల్ని పలువురి సహకారంతో పునరుద్ధరించాడాయన. ఆ జల సంరక్షణ ఉద్యమాన్ని బెంగళూరుకే పరిమితం చేయకూడదని.. అయోధ్య, ఒడిశా, లక్నోలకు విస్తరించాడు. ఆ ప్రాంతాల్లో కూడా అనేక చెరువుల్ని బాగు చేసిన ఆనంద్‌ అక్కడి అధికారులు, పాలకుల మెప్పు పొందాడు.

‘మల్లిగవాడ్‌ ఫౌండేషన్‌’ పేరుతోనే ఈ పనులన్నీ చేస్తున్న ఆయనకు ఇన్ఫోసిస్‌, శ్యాంసంగ్‌, హెచ్‌పీ, ఇంటెల్‌, రాడిసన్‌, బయో కాన్‌ వంటి కార్పొరేట్‌ సంస్థలు చేయూత నిచ్చాయి. ఇప్పటిదాకా వంద కోట్ల రూపాయలకు పైనే నిధులు ఖర్చు అయ్యాయి. ‘‘సహజ వనరులను గౌరవించండి. మీకు ఎంత అవసరమో అంతే వాడుకోండి. ప్రకృతికి అనుకూలంగా జీవించండి. వీలైతే సగంజీవితం మీ కోసం.. మిగిలిన సగం జీవితం ప్రకృతి కోసం జీవించండి. అప్పుడే మన ముందు తరాలకు ఆరోగ్య భవిష్యత్తును అందివ్వగలుగుతాం’’ అంటున్న ఆనంద్‌ చెరువంత అభినందనీయుడు..!.

ఈ వార్తలు కూడా చదవండి.

సినిమా ఇండ‌స్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత

రేవంత్‌రెడ్డీ.. దమ్ముంటే అసెంబ్లీ పెట్టు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 13 , 2025 | 11:20 AM