ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Operation Sindoor: భారత్,పాక్ యుద్ధం.. పాక్‌లో చిక్కుకుపోయిన అమెరికన్ యూట్యూబర్

ABN, Publish Date - May 10 , 2025 | 10:06 AM

Operation Sindoor: పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. ఇండియా ఊహించిన దానికంటే ఎక్కువగానే బుద్ధిచెబుతోంది. పాక్‌లో విధ్వంసం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే పాక్ తమ గగనతలాన్ని మూసేసింది. పూర్తిగా విమానరాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వేరే దేశాల నుంచి పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన వారు అక్కడే ఇరుక్కుపోయారు.

Operation Sindoor

భారత్, పాకిస్తాన్‌ల మధ్య పోరు భీకరంగానే నడుస్తోంది. రెండు దేశాలు ఒకదానిపై ఒకటి మిస్సైల్స్, డ్రోన్లతో దాడి చేసుకుంటున్నాయి. పాకిస్తాన్ ప్రయోగిస్తున్న ఆయుధాలను భారత్ తన టెక్నాలజీతో ధ్వంసం చేస్తోంది. పాక్‌ను కోలుకోని దెబ్బ కొట్టేలా ఎయిర్ బేస్‌లను టార్గెట్ చేసి భారత్ దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే పాక్ తమ గగనతలాన్ని మూసేసింది. పూర్తిగా విమానరాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వేరే దేశాల నుంచి పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన వారు అక్కడే ఇరుక్కుపోయారు. అమెరికాకు చెందిన డ్రీ బిస్కీ కూడా పాకిస్తాన్‌లోనే ఇరుక్కుపోయాడు.


పాకిస్తాన్‌లో ఇరుక్కుపోవటంపై బిస్కీ మాట్లాడుతూ.. ‘ ఇండియాతో గొడవ కారణంగా నేను పాకిస్తాన్‌లో చిక్కుకుపోయాను. ఏయిర్‌పోర్టులన్నీ మూసేశారు. ఈ కష్ట సమయంలో నాకు అండగా నిలుస్తున్న నా ఫాలోవర్లకు ధన్యవాదాలు. నేను బాగానే ఉన్నాను. నాకు పాకిస్తాన్ చాలా బాగా నచ్చింది. ఏయిర్‌పోర్టులు తెరిచే వరకు దేశంలో తిరుగుతూనే ఉంటాను. యుద్ధాన్ని ఆపండి.. ప్రశాంతంగా ఉండండి. నేను ఇప్పుడు కాశ్మీర్ దగ్గరలో ఉన్నాను. ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది.


ఇలాంటి సమయంలో ఇప్పుడు ఇక్కడ ఉండటం ఎంతో మజాగా ఉంది. నాకు వేల మంది మెసేజ్లు చేస్తున్నారు. కాల్స్ చేస్తున్నారు. ఇక్కడ ఉండే వాళ్లు కొంచెం కూడా భయం లేకుండా ఉన్నారు. షాపులు తెరిచే ఉన్నాయి. నా జీవితంలో మరో రోజు ఇక్కడ గడుస్తోంది’ అని అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియో పెట్టాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడు త్వరగా అక్కడినుంచి క్షేమంగా బయట పడాలని కోరుకుంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: ఇండియాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు.. తుస్సుమంటున్న పాక్ మిస్సైల్స్..

Pahalgam Terror Attack: పాకిస్తాన్‌కు మరో దెబ్బ..జీ7 దేశాల కీలక ప్రకటన..

Updated Date - May 10 , 2025 | 10:12 AM