ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Medical College Mess Video: హాస్టల్‌పై పడ్డ విమానం.. వెలుగులోకి భయానక దృశ్యాలు..

ABN, Publish Date - Jun 14 , 2025 | 01:07 PM

BJ Medical College Mess: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన దృశ్యాలు ప్రమాద తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. ఆ వీడియో చూస్తుంటే ఒళ్లుగగుర్పొడుస్తోంది. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

BJ Medical College Mess

అహ్మదాబాద్ విమాన ప్రమాదం యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రపంచ దేశాలు సైతం ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఏఐ 171 విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే బీజే కాలేజ్ హాస్టల్‌పై కుప్పకూలింది. దీంతో విమానంలోని 241 మంది, హాస్టల్‌లోని విద్యార్థులు.. జనవాసాల్లోని ప్రజలు కూడా చనిపోయారు. మొత్తం 274 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక, విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బీజే మెడికల్ కాలేజీ మెస్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

భోజనం చేస్తూ మృత్యు ఒడిలోకి..

విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌పై కుప్పకూలిన సమయంలో.. మెడికల్ కాలేజీ విద్యార్థులు హాస్టల్ మెస్‌లో భోజనం చేస్తున్నారు. ఆ సమయంలో.. కలలో కూడా ఊహించని విధంగా విమానం హాస్టల్ భవనంపై కుప్పకూలింది. మెస్ పైకప్పు, గోడలు బద్ధలు అయ్యాయి. భోజనం చేస్తున్న వారిపై పడ్డాయి. వాటి కింద నలిగిపోయి చాలా మంది చనిపోయారు. మరికొంత మంది తీవ్ర గాయాలపాలై.. ప్రాణాలతో శిథిలాల కింద ఇరుక్కుపోయారు. ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డవారు.. మెస్ కింది ఫ్లోర్లలో ఉన్నవారు హుటాహుటిన మెస్‌లోకి వచ్చారు.

గాయపడ్డ వారికి, శిథిలాల కింద ఇరుక్కుపోయిన వారికి సాయం చేయటం మొదలుపెట్టారు. ఎంతో కష్టపడి వారిని అక్కడినుంచి ఆస్పత్రికి తరలించారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన దృశ్యాలు ప్రమాద తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. ఆ వీడియో చూస్తుంటే ఒళ్లుగగుర్పొడుస్తోంది. ఇక, ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాయాలతో ఆస్పత్రిలో చేరిన వారు త్వరగా కోలు కోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం.. ఇండియన్స్‌కు ఇజ్రాయెల్ క్షమాపణలు..

ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

Updated Date - Jun 14 , 2025 | 02:32 PM