ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Operation Sindoor: భారత్, పాకిస్తాన్ యుద్ధంపై జాన్వీ ఎమోషనల్ పోస్ట్..

ABN, Publish Date - May 10 , 2025 | 01:23 PM

Operation Sindoor: భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధంతో సరిహద్దు ప్రాంతాల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. స్కూల్లు, కాలేజీలు ఇప్పటికే మూతపడ్డాయి. విమానయాన శాఖ ఏయిర్‌పోర్టులను సైతం మూసేసింది.

Actress Janhvi Kapoor

నా భారత దేశం చాలా సున్నితమైనది. నూటికి 99 సార్లు మంచితనంతో నొప్పిని భరిస్తుందే తప్ప తిరిగికొట్టదు. మంచి తనాన్ని చేతకాని తనంగా భావిస్తే మాత్రం కూసాలు కదిలిపోయేలా సమాధానం చెబుతుంది. పాకిస్తాన్ విషయంలో అదే జరుగుతోంది. పాతికేళ్ల పాటు పాకిస్తాన్ అరాచకాలను మౌనంగా భరిస్తూ వచ్చింది. యుద్ధం ఎందుకు అనుకుంది. పాకిస్తాన్ హద్దులు మీరటంతో గట్టిగా సమాధానం చెబుతోంది. భారత్, పాకిస్తాన్‌పై యుద్ధం చేయడాన్ని ప్రతీ భారత పౌరుడు సమర్థిస్తున్నాడు. సెలెబ్రిటీలు సైతం తమ పూర్తి మద్దతు పలుకుతున్నారు. తాజాగా, ప్రముఖ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ యుద్ధంపై ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు.


జాన్వీ కపూర్ తన పోస్టులో.. ‘ గత రాత్రి న్యూస్ ఛానళ్లలో, సోషల్ మీడియాలో యుద్ధం తాలూకా దృశ్యాలు చూశాను. అవి సినిమాకు మించినవిగా అనిపించాయి. నా జీవితంలో ఇలాంటి వాటిని నేనెప్పుడూ భారత గడ్డపై చూల్లేదు. నేను ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఆందోళనకు గురయ్యాను. వేరే దేశాలు యుద్ధాలు చేస్తుంటే సర్ధుకుపోవాలని, గొడవలు ఎందుకని చెప్పేవాళ్లం. ఇప్పుడు అదే యుద్ధం మన తలుపులు తట్టింది. ఈ యుద్ధంలో రెండు దేశాలకు చెందిన అమాయక ప్రజల ప్రాణాలు పోతాయని తలుచుకుంటే బాధగా ఉంది.


చరిత్ర పరంగా చూసుకున్నా... గుణం పరంగా చూసుకున్నా భారతీయులు ఆగ్రహపరులు కాదు. ఇతర దేశాలపై మొదటగా యుద్ధానికి కాలు దువ్వం. అయితే.. ఎన్నో ఏళ్ల కుట్రలు, దాడుల తర్వాత తిరగబడ్డాం. దెబ్బకు దెబ్బ తీస్తున్నాం. త్రివిధ దళాలు వీరోచితంగా పోరాడుతున్నాయి. ఏ ఒక్క భారత పౌరుడికి హాని కలుగకుండా చూసుకుంటాయని గట్టిగా నమ్ముతున్నాను. సైన్యానికి నా సెల్యూట్. సైన్యం సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’ అంటూ ఎమోషనల్ అయ్యారు. జాన్వీ పెట్టిన ఈ పోస్టుపై ఆమె అభిమానులు పెద్ద సంఖ్యలో స్పందిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: భారత్, పాక్ యుద్ధం అప్‌డేట్స్ మీ ఫోన్లో చూడాలనుకుంటే ఇలా చేయండి..

Operation Sindoor: పాక్ సైన్యం సరిహద్దుల దిశగా కదులుతోంది.. కల్నల్ సోఫియా ఖురేషీ

Updated Date - May 10 , 2025 | 01:25 PM