Funny Video: ఇదేం ఆత్రం బాబాయ్.. మద్యం షాప్‌నకు వెళ్లి అతడు చేసిన పని చూస్తే నవ్వకుండా ఉండలేరు..
ABN, Publish Date - Jul 09 , 2025 | 03:06 PM
జనాలు చేసే కొన్ని పనులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ వ్యక్తి మద్యం దుకాణం దగ్గర చేసిన పని చాలా మందిని కడుపుబ్బా నవ్విస్తోంది. ఆ వీడియో చూసిన వారందరూ నవ్వుకుంటున్నారు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా జనాలు చేసే కొన్ని పనులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు (Funny Videos) చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ వ్యక్తి మద్యం దుకాణం (Wine Shop) దగ్గర చేసిన పని చాలా మందిని కడుపుబ్బా నవ్విస్తోంది. ఆ వీడియో చూసిన వారందరూ నవ్వుకుంటున్నారు.
memezenon అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి మద్యం దుకాణం దగ్గరకు వెళ్లాడు. మద్యం షాప్‌నకు ముందు ఇనుప గ్రిల్‌ను అమరుస్తారనే సంగతి తెలిసిందే. అందులో చేయి పెట్టడానికి మాత్రమే ఖాళీ ఉంటుంది. అయితే తనకు నచ్చిన బ్రాండ్ ఎంచుకునే క్రమంలో ఓ వ్యక్తి తన తలను ఆ గ్రిల్ లోపలికి పెట్టేశాడు. తనకు కావాల్సిన బాటిల్ తీసుకున్నాడు. అయితే తన తలను మాత్రం తిరిగి బయటకు తీయలేక అందులో ఇరుక్కుపోయాడు. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయాడు. దీంతో చుట్టు పక్కల వారు అతడికి సహాయం చేసి బయటకు లాగారు.
ఈ ఫన్నీ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను లక్షల మంది వీక్షించారు. వందల మంది ఈ వీడియోను లైక్ చేసి తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు. మద్యం కోసం కొందరు ఏమైనా చేస్తారని ఒకరు కామెంట్ చేశారు. అతడు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా మద్యం బాటిల్‌ను మాత్రం వదల్లేదని ఒకరు సరదాగా పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
తాగేసి పడిపోయిన యజమాని.. ఎద్దు అతడిని ఇంటికి ఎలా తీసుకెళ్తోందో చూడండి..
మీది డేగ చూపు అయితే.. ఈ ఫొటోలో 99ల మధ్యనున్న 96ను 5 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jul 09 , 2025 | 03:06 PM