Viral Video: తాగేసి పడిపోయిన యజమాని.. ఎద్దు అతడిని ఇంటికి ఎలా తీసుకెళ్తోందో చూడండి..
ABN , Publish Date - Jul 08 , 2025 | 08:24 AM
జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో మరింత మందిని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా బ్రెజిల్‌లో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు (Animals Videos) మరింత మందిని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా బ్రెజిల్ (Brazil)లో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
@HumansNoContext అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి మద్యం మత్తులో రోడ్డుపై నడుస్తున్నాడు. చాలా మత్తులో ఉన్న అతడు సరిగ్గా నడవలేకపోతున్నాడు. అతడి ఎద్దు (Bull) అతడిని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్తోంది. సరిగ్గా నడవలేకపోతున్న అతడిని ఆ ఎద్దు తన తలతో ముందుకు నెడుతూ తీసుకెళ్తోంది. చూస్తుంటే అది అతడి దినచర్యలా కనబడుతోంది. ఎద్దు తీసుకెళ్తోంటే మత్తులో ఉన్న ఆ వ్యక్తి రోడ్డు మీద కనబడిన వారితో మాట్లాడుతూ ముందుకు వెళ్తున్నాడు.
యజమాని పట్ల ఎద్దు విధేయత, దాని తెలివితేటలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 15 లక్షల మందికి పైగా వీక్షించారు. 54 వేల మంది ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఈ ఎద్దు యజమానికి నిజమైన స్నేహితుడని, అతడిని సురక్షితంగా ఇంటికి తీసుకెళ్తున్నాడని ఒకరు కామెంట్ చేశారు. చూస్తుంటే ఆ ఎద్దుకు అది బాగా అలవాటైన పనిలా కనిపిస్తోందని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
మహిళా ఉద్యోగిని అసభ్యంగా టచ్ చేస్తున్న బాస్.. ఎస్బీఐ మేనేజర్ తీరు చూస్తే..
మీ కళ్లకు సవాల్.. ఈ గదిలో నల్ల పిల్లి ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..