Shocking Accident Video: స్టూడెంట్ సైకిల్ మీద వెళ్తుండగా వేగంగా వచ్చిన స్కార్పియో.. తర్వాతేం జరిగిందో చూస్తే..
ABN, Publish Date - Jul 29 , 2025 | 03:38 PM
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఆ వీడియోలో సైకిల్ మీద వస్తున్న ఓ కుర్రాడి పైకి ఓ స్కార్పియో వేగంగా దూసుకెళ్లింది. అయితే చివరి నిమిషంలో అంతా తారుమారు అయింది.
వర్షాకాలంలో రోడ్లన్నీ జలమయం అయిపోతాయి. వీధులు, జంక్షన్లు, వంతెనలు, ఫ్లై ఓవర్లు, రోడ్లపై నీరు నిలిచిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఎంత పెద్ద కారులో వెళ్లే వారైనా జాగ్రత్తగా వెళ్లాల్సిందే. లేకపోతే భారీ ప్రమాదాలకు (Road Accidents) గురి కావాల్సి వస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఆ వీడియోలో సైకిల్ మీద వస్తున్న ఓ కుర్రాడి పైకి ఓ స్కార్పియో (Scorpio) వేగంగా దూసుకెళ్లింది. అయితే చివరి నిమిషంలో అంతా తారుమారు అయింది.
@ShivAroor అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. నీటితో నిండి ఉన్న ఓ వంతెనపై నుంచి ఓ కుర్రాడు సైకిల్ మీద వెళ్తున్నాడు. అదే సమయంలో ఎదురుగా ఓ స్కార్పియో చాలా వేగంగా వచ్చింది. కుర్రాడి పక్క నుంచి వేగంగా వెళ్లింది. అందువల్ల రోడ్డు మీద నీరంతా పైన పడి ఆ కుర్రాడు తడిసిపోయాడు. అయితే అమిత వేగం కారణంగా ఆ స్కార్పియో అదుపు తప్పింది. పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లి బోల్తా పడింది. అదృష్టవశాత్తూ ఆ కుర్రాడికి చిన్న గాయం కూడా కాలేదు. ఆ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. 11 లక్షల మందికి పైగా ఆ వీడియోను వీక్షించారు. 17 వేల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఈ ఘటన కేరళలో జరిగిందని ఒకరు కామెంట్ చేశారు. అలా జరుగుతుందని ఆ వీడియోను రికార్డు చేసిన వ్యక్తికి ముందే తెలుసా అంటూ మరొకరు ప్రశ్నించారు. ఆ డ్రైవర్ పెద్ద మూర్ఖుడిలా ఉన్నాడని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఇలాంటి ఫైట్ ఇప్పటివరకు చూసుండరు.. పిల్లితో పావురం ఎలా ఫైట్ చేసిందో చూడండి..
ఈ ఫొటోలో ఐస్‌క్రీమ్‌లను చూశారా.. వీటిల్లో ఖాళీగా ఉన్న మూడు కోన్లు ఎక్కడున్నాయో పట్టుకోండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jul 29 , 2025 | 03:38 PM