Deer Emotional Video: తప్పిపోయిన జింక పిల్లను తీసుకొచ్చిన వ్యక్తి.. తల్లి ఎలా థ్యాంక్స్ చెప్పిందో చూడండి..
ABN, Publish Date - Aug 05 , 2025 | 12:53 PM
తాజాగా ఓ జింక తన బిడ్డ తప్పిపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైంది. ఓ వ్యక్తి ఆ జింక పిల్లను తీసుకొచ్చినపుడు ఎంతో భావోద్వేగానికి గురైంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ప్రపంచంలో అన్నింటి కంటే గొప్పది తల్లి (Mother) ప్రేమ. మనుషులైనా, జంతువులైనా తమ పిల్లల కోసం తపన పడడం సహజం. బిడ్డ దూరమైనపుడు కలిగే బాధను తల్లి మాత్రమే అర్థం చేసుకోగలదు. బిడ్డ రక్షణ కోసం తల్లి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది. తాజాగా ఓ జింక (Deer) తన బిడ్డ తప్పిపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైంది. ఓ వ్యక్తి ఆ జింక పిల్లను (Baby deer) తీసుకొచ్చినపుడు ఎంతో భావోద్వేగానికి గురైంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
@awkwardgoogle అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఆ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ జింక తన బిడ్డ కనబడక చెట్ల మధ్యలో అటూ ఇటూ తిరుగుతోంది. ఆ సమయంలో ఓ వ్యక్తి జింక పిల్లను తీసుకొచ్చి తల్లి ముందు నిల్చోబెట్టాడు. ఆ తర్వాత జింక కింద పడితే మరోసారి దానిని తీసుకెళ్లి తల్లి ముందు ఉంచాడు. అక్కడి నుంచి అతడు వెళ్లిపోతున్న సమయంలో తల్లి జంక చాలా సేపు అతడి వైపు చూస్తూ ఉండిపోయింది. ఒక కాలు పైకి ఎత్తి అతడికి ధన్యవాదాలు చెబుతున్నట్టుగా చూసింది.
ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 12 లక్షల మందికి పైగా వీక్షించారు. 30 వేల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఆ జింక అతణ్ని చాలా ప్రేమగా చూస్తోందని ఒకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
ఈ ఫొటోలో ఉన్న మొత్తం జంతువులను 25 సెకెన్లలో కనిపెడితే.. మీ కళ్లకు స్టార్ రేటింగ్ ఇవ్వాల్సిందే..
ప్రమాదాన్ని తేలిగ్గా తీసుకుంటే ఇలాగే ఉంటుంది.. అతడి పరిస్థితి ఏమైందో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Aug 05 , 2025 | 12:53 PM