Share News

Shocking Video: ప్రమాదాన్ని తేలిగ్గా తీసుకుంటే ఇలాగే ఉంటుంది.. అతడి పరిస్థితి ఏమైందో చూడండి..

ABN , Publish Date - Aug 05 , 2025 | 12:29 PM

ప్రమాదాలతో ఆటలాడడం కొంత మందికి సరదా. ప్రమాదాలకు ఎదురెళ్లి మరీ అపాయాలను కొని తెచ్చుకుంటారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి భారీ మూల్యం చెల్లించుకుంటారు. తాజాగా ఓ వ్యక్తి ప్రమాదం అని తెలిసీ మొండిగా ముందుకెళ్లాడు. తీవ్ర నష్టం చవిచూశాడు.

Shocking Video: ప్రమాదాన్ని తేలిగ్గా తీసుకుంటే ఇలాగే ఉంటుంది.. అతడి పరిస్థితి ఏమైందో చూడండి..
Dangerous stunt

ప్రమాదాలతో (Danger) ఆటలాడడం కొంత మందికి సరదా. ప్రమాదాలకు ఎదురెళ్లి మరీ అపాయాలను కొని తెచ్చుకుంటారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి భారీ మూల్యం చెల్లించుకుంటారు. తాజాగా ఓ వ్యక్తి ప్రమాదం అని తెలిసీ మొండిగా ముందుకెళ్లాడు. తీవ్ర నష్టం చవిచూశాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. @PalsSkit అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది (Viral video).


వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. భారీ వర్షాల కారణంగా ఓ కాలువలో వేసిన వంతెన పూర్తిగా మునిగిపోయింది. ఆ వంతెన మీద నుంచి భారీగా నీరు (Water Flood) ప్రవహిస్తోంది. ఆ నీటి ప్రవాహానికి భయపడి చాలా మంది బయటనే ఆగిపోయారు. అయితే ఓ ట్రాక్టర్ డ్రైవర్ మాత్రం ఆ ప్రవాహాన్ని లైట్‌గా తీసుకున్నాడు. సులభంగా దాటేయ్యగలననుకున్నాడు. ఆ నీటిలోకి ట్రాక్టర్‌ను పోనిచ్చాడు. అయితే మధ్యలోకి వెళ్లేసరికి ఆ నీటి ప్రవాహం కారణంగా ట్రాక్టర్ కొట్టుకుపోయింది. నీటిలో తిరగబడి పోయింది.


ఆ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను లక్షల మంది వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఇలాంటి సాహసాలు ప్రాణాలకే ప్రమాదకరం అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. అతడికి నీటి శక్తి తెలిసినట్టు లేదు అని మరొకరు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఒకేసారి రెండు కప్పలను మింగిన పాము పరిస్థితి చూడండి..

ఈ మంచులో కుక్క ఎక్కడుందో 20 సెకెన్లలో కనిపెడితే.. మీ కళ్లకు తిరుగులేదు..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 05 , 2025 | 12:29 PM