Raisins: ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ ఎన్ని ఎండుద్రాక్షలు తినాలో తెలుసా..
ABN, Publish Date - Apr 02 , 2025 | 08:13 AM
రోజూ ఎండుద్రాక్షలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
రోజూ ఎండుద్రాక్షలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఎన్ని ద్రాక్షలు తింటే ఆరోగ్యంగా ఉంటుందనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఎండుద్రాక్షలో ఐరన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్‌తో పాటూ యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యంగా ఉండేలా సహకరిస్తాయి.
రోజులో 25 గ్రాముల నుంచి 50 గ్రాముల పరిమాణంలో ఎండు ద్రాక్షలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
మీ రోజువారీ ఆహారంలో ఎండుద్రాక్షలను చేర్చడం వల్ల ఎముకలతో పాటూ కండరాలు కూడా బలంగా మారతాయి. అలాగే పేగులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
రోజూ ఎండుద్రాక్షలను తినడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయటపడొచ్చు. అదేవిధంగా బరువు కూడా అదుపులో ఉంటుంది.
అలసట తగ్గి రోజంతా హుషారుగా ఉండడంలో కూడా ఎండుద్రాక్షలు సాయం చేస్తాయి. అలాగే నోటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
ఎండుద్రాక్షలను నీటిలో నానబెట్టి తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Updated Date - Apr 02 , 2025 | 08:14 AM