Health Tips: అంజీర్ నీళ్లు తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..
ABN, Publish Date - Sep 07 , 2025 | 10:08 PM
అంజీర్ పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం తాగడ వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.
అంజీర్ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే విషయం తెలిసిందే. అయితే అంజీర్ పండ్ల నీటిని తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
అంజీర్ పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం తాగడ వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.
అంజీర్ పండ్ల నీరు తాగడం వల్ల కడుపు శుభ్రంగా ఉంటుంది. అలాగే మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది.
అంజీర్ పండ్లలో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో సాయం చేస్తాయి.
అంజీర్ పండ్లలో ఉండే పొటాషియం రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.అంజీర్ నీరు ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా మెరుగుపరుస్తుందని కొన్ని పరిశోధనల్లో తేలింది.
బరువు తగ్గాలనుకునేవారికి అంజీర్ పండ్ల నీరు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. తద్వారా ఎక్కువ సార్లు తినకుండా చేస్తుంది .
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Updated Date - Sep 07 , 2025 | 10:08 PM