ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Cheapest Diesel Car: భారత్‌లో అత్యంత చవకైన డీజిల్ కారు ఇదే

ABN, Publish Date - Nov 04 , 2025 | 02:59 PM

నిత్యం ప్రయాణాలు చేసే వారికి డీజిల్ కారుకు మించిన ప్రత్యామ్నాయం లేదు. మరి భారత్‌లో అత్యంత చవకైన డీజిల్ కారు ఏదో ఈ కథనంలో తెలుసుకుందాం.

1/6

భారత్‌లో ప్రస్తుతం టాటా ఆల్ట్రోజ్ అత్యంత చవకైన డీజిల్ కారుగా పేరుగాంచింది. ఇందులో అనేక ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.

2/6

1.2 లీటర్ పెట్రోల్ వేరియంట్, 1.5 లీటర్ డీజిల్ వేరియంట్స్‌ అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ వర్షెన్‌లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్‌జీ కిట్ కూడా ఉంది. ఇందులో 5 స్పీడు మ్యానువల్ ట్రాన్స్‌మిషన్ ఉంటుంది.

3/6

ఇక డీజిల్ వేరియంట్‌లో ఇంజెన్ 90పీఎస్ పవర్, 200ఎన్‌ఎమ్ టార్క్‌ను డెలివర్ చేస్తుంది. మైలేజీ లీటరుకు ఏకంగా 23.64 కిలోమీటర్లు.

4/6

డీజిల్ వేరియంట్‌లో అనేక ప్రీమియం ఫీచర్స్ ఉన్నాయి. 10.25 అంగుళాల టచ్ స్క్రీన్, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 7 అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ డిజిటల్ క్లస్టర్, వాయిస్ కమాండ్స్ ఆధారిత సన్‌రూఫ్, వైర్‌లెస్ చార్జింగ్ సౌకర్యం, 360 డిగ్రీ కెమెరా కూడా ఉంది.

5/6

భద్రతా ప్రమాణాల్లో కూడా ఈ కారు టాప్. దీనికి ఫైవ్ స్టార్ గ్లోబల్ ఎన్‌సీఏపీ రేటింగ్ ఉంది. 6 ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీతో కూడిన ఏబీఎస్, ఈఎస్‌సీ, ఐఎస్‌ఓఎఫ్ఐఎక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, రియర్ పార్కింగ్ సెన్సర్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉన్నాయి.

6/6

మారుతీ బాలెనో, హ్యుందాయ్ ఐ20, టొయోటా గ్లాన్జా వంటి బ్రాండ్స్‌కు ఆల్ట్రోజ్ గట్టిపోటీ ఇస్తోంది. మోడల్‌ను బట్టి ఈ కారు ధర రూ.6.30 లక్షల నుంచి రూ.10.51 లక్షల వరకూ ఉంటుంది.

Updated Date - Nov 04 , 2025 | 03:04 PM