ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips: క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే.. 5 ఆహారాలివే..

ABN, Publish Date - Jun 20 , 2025 | 04:22 PM

ప్రస్తుత జీవన విధానంలో మనిషిని అనేక రోగాలు చుట్టుముడుతున్నాయి. వాటిలో క్యాన్సర్ ఒకటి. ఇది ప్రమాదకరమైన వ్యాధే అయినా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీన్ని నియంత్రించవచ్చు.

1/7

ప్రస్తుత జీవన విధానంలో మనిషికిని అనేక రోగాలు చుట్టుముడుతున్నాయి. వాటిలో క్యాన్సర్ ఒకటి. ఇది ప్రమాదకరమైన వ్యాధే అయినా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీన్ని నియంత్రించవచ్చు. ఇందుకోసం ప్రధానంగా తీసుకోవాల్సిన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

2/7

ద్రాక్ష తొక్కలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు కలిగిన రెస్వెరాట్రాల్ అనే సమ్మేళనం ఉంటుంది. అలాగే ద్రాక్ష విత్తనాల్లో ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ ఆమ్లాలు, ఆంథోసైనిన్లు తదితర పోషకాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్ నిరోధకాలుగా పని చేస్తాయి.

3/7

ఆపిల్స్‌లోని పాలీఫెనాల్స్ అనే సమ్మేళనం క్యాన్సర్ నిరోధకంగా పని చేస్తుంది. అలాగే వాపు, గుండె జబ్బులు, అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.

4/7

మీ ఆహారంలో బ్రోకలీని చేర్చడం వల్ల కూడా క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. ఇందులో ఉండే సల్ఫోరాఫేన్ అనే సమ్మేళనం.. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కణాలను నిరోధించడంలో సహకరిస్తుంది. అలాగే పెద్ద ప్రేగు, మల క్యాన్సర్‌ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

5/7

క్యారెట్లు తరచూ తీసుకోవడం వల్ల కడుపు, ప్రోస్టేట్, ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది.

6/7

సాల్మన్, మాకేరెల్, ఆంకోవీస్ తదితర కొవ్వు చేపలు తీసుకోవడం వల్ల కూడా క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ఈ చేపల్లోని విటమిన్-బి, పొటాషియం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు. కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ను కూడా దూరం చేస్తుంది.

7/7

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated Date - Jun 20 , 2025 | 04:43 PM