Diabetes Diet: డయాబెటిస్ నుండి బయటపడటానికి ఏ ఆహారం మంచిదో మీకు తెలుసా?
ABN, Publish Date - Oct 11 , 2025 | 01:19 PM
ప్రపంచవ్యాప్తంగా, ఇటీవలి కాలంలో డయాబెటిస్ కేసులు పెరుగుతున్నాయి. దీనికి ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లు, జన్యుశాస్త్రం వంటి అనేక కారణాలు ఉన్నాయి. అయితే, ఈ ఆహారాలతో డయాబెటిస్‌ను కంట్రోల్ చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
భారతదేశంలో మధుమేహం బాధితుల సంఖ్య పెరుగుతోంది. కాబట్టి, మధుమేహాన్ని నివారించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం చాలా ముఖ్యం.
ఎట్టి పరిస్థితిలోనూ ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్స్ తినకూడదు.
షుగర్ పేషెంట్స్ ఎలాంటి భయం లేకుండా.. యాపిల్, జామకాయ, కమల, కెవి, బెర్రీ, దానిమ్మ పండ్లను తినవచ్చు. ఎందుకంటే, ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
డయాబెటిస్ ఉన్నవారు పాలకూర, కాలే, బ్రోకలీ వంటి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆకుకూరలు తినవచ్చు. ఈ ఆకుకూరలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
డయాబెటిస్ ఉన్నవారు తృణధాన్యాలు తినడం చాలా మంచిది. బార్లీ, ఓట్స్, బ్రౌన్ రైస్ వంటి తృణధాన్యాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా, ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
Updated Date - Oct 11 , 2025 | 01:19 PM