Vinayaka Chavithi 2025: సందడిగా మారిన మోండా మార్కెట్
ABN, Publish Date - Aug 26 , 2025 | 09:49 PM
వినాయక చవిత నేపథ్యంలో సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్ సందడిగా మారింది. పూజ చేసేందుకు పత్రి, పూలు, వినాయకుడి విగ్రహం కోసం మంగళవారం మార్కెట్‌కు ప్రజలు పోటెత్తారు.
వినాయక చవిత నేపథ్యంలో మోండా మార్కెట్ మంగళవారం సందడిగా మారింది.
పూజ చేసేందుకు పత్రి, పూలు, వినాయకుడి విగ్రహం కోసం మంగళవారం మార్కెట్‌కు ప్రజలు పోటెత్తారు.
ఈ సందర్భంగా పూల దుకాణాలు, వస్త్ర దుకాణాలు కిక్కిరిసి పోయాయి.
దేవుని విగ్రహాలతోపాటు పత్రి విక్రయాలు జోరుందుకున్నాయి. వీటి కొనుగోలు కోసం భక్తులు బేరసారాలకు దిగారు.
అలాగే అరటి పళ్లు, కొబ్బరికాయలు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
వీటికి పోటీగా పత్రి ధరలు ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం వరకు చవితి ఘడియలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి లోపే పూజకు సంబంధించిన సామాగ్రి కొనుగోలు చేసేందుకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఊరు వాడా అంతా మార్కెట్లకు తరలి వెళ్లారు.
Updated Date - Aug 26 , 2025 | 09:49 PM