ట్రాఫిక్ నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం అవసరం: తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
ABN, Publish Date - Sep 18 , 2025 | 03:28 PM
ట్రాఫిక్ నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం అవసరమని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రాఫిక్ సమ్మిట్ 2025 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ట్రాఫిక్ నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం అవసరమని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రాఫిక్ సమ్మిట్ 2025 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్ నిర్వహణ, అభివృద్ధిని తమ రాష్ట్రం త్రిపుర ముఖ్యమంత్రికి వివరిస్తానని ఆయన పేర్కొన్నారు.
భారతదేశంలో గత పదేళ్లలో 60 శాతం మేర జాతీయ రహదారులు విస్తరించాయని వివరించారు. రహదారిపై క్రమశిక్షణ ఉన్న చోట ప్రాణానికి రక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా త్రిపురలో ట్రాఫిక్‌పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్‌సీఎస్సీ) ఆధ్వర్యంలో ట్రాఫిక సమ్మిట్ 2025ను నిర్వహిస్తున్నారు. ఈ సమ్మిట్ రెండు రోజుపాటు జరుగుతుంది. ఇది సెప్టెంబర్ 19వ తేదీతో ముగియనుంది.
ఈ సమ్మిట్‌లో వివిధ ప్రభుత్వ విభాగాలు స్వచ్ఛంద సంస్థలు, నిపుణులు, ప్రజలు పాల్గొన్నారు. ట్రాఫిక ఇబ్బందులు లేని సురక్షిత నగరాన్ని సాకారం చేయడానికి తీసుకోవల్సిన చర్యలను ఈ సదస్సు వేదికగా చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కీలక సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు.
ఈ సదస్సులో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Updated Date - Sep 18 , 2025 | 03:28 PM