ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించి.. పూజించిన సీఎం రేవంత్ రెడ్డి

ABN, Publish Date - Sep 05 , 2025 | 06:43 PM

ఖైరతాబాద్ వినాయకుడిని సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామికి హారతి ఇచ్చారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ.. గతంలో పీసీసీ చీఫ్‌గా.. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు.

1/10

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారికి సీఎం ప్రత్యేక పూజలు చేసి.. తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా స్వామి వారికి హారతి ఇచ్చారు.

2/10

అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. 71 ఏళ్ల క్రితం గణేశ్ ఉత్సవ సమితి ఒకే ఒక్క అడుగు గణేశుడిని ప్రతిష్టించుకుని ఉత్సవాలను ప్రారంభించిందని గుర్తు చేశారు. దేశంలోనే గణేశ్ ఉత్సవాలకు ఖైరతాబాద్ ప్రసిద్ధి చెందిందన్నారు.

3/10

ఒక్కసారి నిర్వహణే కష్టమైన ప్రస్తుత రోజుల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని తట్టుకుంటూ ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి ఉత్సవాలను కొనసాగిస్తోందని పేర్కొన్నారు.

4/10

గతంలో పీసీసీ చీఫ్‌గా.. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

5/10

రాష్ట్రంలో గణేశ్ మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించిందని చెప్పారు.

6/10

ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో ఎక్కడా సమస్యలు లేకుండా ఉత్సవాలను పూర్తి చేసుకున్నామన్నారు

7/10

ఈ ఉత్సవాలను విజయవంతంగా ముగించిన గణేశ్ ఉత్సవ సమితి సభ్యులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.

8/10

రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉత్సవ సమితికి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

9/10

ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి ఉత్సవ సమితి నిర్వహకులతోపాటు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు.

10/10

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఖైరతాబాద్ వినాయకుడిని ఏర్పాటు చేసిన పరిసర ప్రాంతాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - Sep 05 , 2025 | 06:44 PM