Telangana Liquor Shops: భారీగా తగ్గిన మద్యం దుకాణాల దరఖాస్తులు..
ABN, Publish Date - Oct 17 , 2025 | 03:06 PM
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఈ దరఖాస్తుల స్వీకరణకు రేపు.. అంటే శనివారం (అక్టోబర్ 18వ తేదీ) చివరి రోజు. శుక్రవారం వరకు కేవలం 25 వేల మద్యం దరఖాస్తులు మాత్రమే వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.

బుధవారం వరకు 9,600 దరఖాస్తులు రాగా.. గురువారం ఒక్క రోజే 10 వేల దరఖాస్తులు వచ్చాయని వారు వివరించారు. శనివారం చివరి రోజు కావడంతో.. అనుకున్న స్థాయిలో దరఖాస్తులు వస్తాయా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.
మరో వైపు రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడం, బిజినెస్ తగ్గిపోవడం తదితర కారణాలతో వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి.. పోటీ లేకుండా దరఖాస్తులు వేస్తున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి.
గతేడాది మద్యం దుకాణాల కోసం 1.31 లక్షల దరఖాస్తులు వచ్చాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఈ ఏడాది ఆ సంఖ్యకు చేరుకుంటామా అని ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Oct 17 , 2025 | 03:08 PM