తెలంగాణలో తగ్గిన చలి.. కోల్డ్ వేవ్‌కు బ్రేక్!
ABN, Publish Date - Nov 23 , 2025 | 08:12 AM
తెలంగాణపై చలి పంజా విసురుతోంది. కొన్ని రోజులుగా చలి గాలులు ప్రజలను వణికిస్తున్నాయి. ఉదయం 10 గంటల వరకు కూడా చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే రెండు రోజులుగా చలి తీవ్రత తగ్గింది.
తెలంగాణపై చలి పంజా విసురుతోంది. కొన్ని రోజులుగా చలి గాలులు ప్రజలను వణికిస్తున్నాయి. ఉదయం 10 గంటల వరకు కూడా చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది.
ఉదయం వేళల్లో ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు జనాలు భయపడుతున్నారు. మహిళలు, పిల్లలు అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతున్నాయి. శుక్ర, శని వారాల్లో చలి తీవ్రత కాస్తా తగ్గింది.
రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఆదివారం కూడా చలి తీవ్ర కొంత తగ్గింది.
ఇదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
రెండు రోజుల క్రితం వరకు తెలంగాణ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎముకలు కొరికే చలితో జనాలు గజ గజ వణికిపోయారు.
Updated Date - Nov 23 , 2025 | 08:16 AM