Ram Charan Met Narendra Modi: ప్రధాని మోదీతో హీరో రామ్ చరణ్ సమావేశం
ABN, Publish Date - Oct 11 , 2025 | 09:52 PM
ప్రధాని మోదీతో టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ శనివారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. రామ్ చరణ్ వెంట ఉపాసనతోపాటు ఆమె తండ్రి అనిల్ కామినేని ఉన్నారు.
ప్రధాని మోదీతో టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ సమావేశమయ్యారు. శనివారం న్యూఢిల్లీలో ప్రధాని మోదీని రామ్ చరణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. రామ్ చరణ్ వెంట ఉపాసనతోపాటు ఆమె తండ్రి అనిల్ కామినేని ఉన్నారు.
ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)కు హీరో రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఈ ఏపీఎల్ రేపటితో అంటే అక్టోబర్ 12వ తేదీ ఆదివారంతో ముగియనుంది.
ప్రపంచంలోనే తొలి ప్రొఫెషనల్ ఆర్చరీ లీగ్‌గా ఏపీఎల్‌కు పేరుంది. ఈ ఏపీఎల్ గ్రాండ్ ఫినాలే.. రేపు అంటే ఆదివారం జరగనుంది.
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీతో రామ్ చరణ్, ఉపాసన, అనిల్ కామినేని కలిశారు. ఈ సందర్భంగా ఏపీఎల్‌కు సంబంధించిన వివరాలను ప్రధాని మోదీకి వారు వివరించారు. అందుకు సంబంధించిన వివరాలను హీరో రామ్ చరణ్ తన ఎక్స్ ఖాతా వేదికగా పంచుకున్నారు.
Updated Date - Oct 11 , 2025 | 09:56 PM