ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సర్వం సిద్ధం.. నిమజ్జనానికి తరలి వెళ్తున్న గణనాథుడు

ABN, Publish Date - Sep 04 , 2025 | 08:19 PM

నవరాత్రల్లో భాగంగా భక్తుల నుంచి ఘనంగా పూజలందుకున్న వినాయకుడిని నిజమజ్జనం చేసేందుకు సమయం అసన్నమైంది. ఇప్పటికే నగరంలోని వివిధ ప్రాంతాల్లో గణపతిని నిమజ్జనం చేస్తున్నారు.

1/10

నవరాత్రల్లో భాగంగా భక్తుల నుంచి ఘనంగా పూజలందుకున్న వినాయకుడిని నిజమజ్జనం చేసేందుకు సమయం అసన్నమైంది. ఇప్పటికే నగరంలోని వివిధ ప్రాంతాల్లో గణపతిని నిమజ్జనం చేస్తున్నారు.

2/10

హైదరాబాద్ నగర వ్యాప్తంగా 303 కిలోమీటర్లు మేర గణేష్ శోభాయాత్రలు కొనసాగనున్నాయి. అందుకోసం మున్సిపల్, పోలీస్ ఉన్నతాధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు.

3/10

ఆ క్రమంలో నిమజ్జనానికి సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలో 13 కంట్రోల్ రూమ్‌‌లు ఏర్పాటు చేశారు. 30 వేల మంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

4/10

భద్రత, రవాణా కోసం 160 గణేష్ యాక్షన్ టీమ్స్ ఏర్పాటు చేశారు.

5/10

హైదరాబాద్ మహానగరంలో నిమజ్జనం కోసం 20 ప్రధాన చెరువులు, 72 కృత్రిమ కొలనులను అధికారులు ఏర్పాటు చేశారు.

6/10

134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు నిమజ్జన స్థలాల్లో సిద్ధంగా ఉంచారు. ఇక ప్రజల రక్షణ కోసం హుస్సేన్ సాగర్‌‌లో 9 బోట్లు సిద్ధం చేశారు.

7/10

200 మంది గజ ఈతగాళ్లను చెరువులు, కొలనుల వద్ద ఉంచనున్నారు. శానిటేషన్ కోసం 14,486 మంది సిబ్బందిని విధుల్లోకి తీసుకున్నారు.

8/10

నిమజ్జన యాత్ర మార్గాల్లో 56,187 విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 6వ తేదీన 50 వేల విగ్రహాలు నిమజ్జనానికి తరలి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

9/10

ఇక ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం 6వ తేదీ నిర్వహించనున్నారు. దీనిని ఆ రోజు మధ్యాహ్నం 1:30 గంటలోపు పూర్తిచేయాలని నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే వినాయక నిమజ్జనాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రత్తమయ్యారు.

10/10

భారీ వర్షాలకు నగరంలోని పలుప్రాంతాల్లో రహదారులు గుంతలమయంగా మారాయి. వాటికి మరమ్మతులు చేస్తున్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

Updated Date - Sep 04 , 2025 | 08:19 PM