Moosi River Flood: మూసీ కల్లోలం.. ఇళ్లలోకి నీరు.. కొనసాగుతున్న సహాయక చర్యలు
ABN, Publish Date - Sep 27 , 2025 | 04:43 PM
భారీ వర్షాల కారణంగా మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. జంట జలాశయాల గేట్లు ఎత్తేయడంతో మూసీకి వరద ప్రవాహం మరింత పెరిగింది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. రెస్క్యూ టీమ్స్ వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
భారీ వర్షాలకు మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది
మూసీ నది పక్కన ఉన్న బస్తీలోని ఇళ్లలోకి నీరు చేరాయి
మూసీ పరివాహక ప్రాంతాలు, కాలనీలు నీట మునిగాయి
సహాయం కోసం బిల్డింగ్‌లపై నుంచి ఎదురుచూస్తున్న బాధితులు
డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి
వరదల్లో చిక్కికున్న బాధితులను బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు
బాధితులను పునరవాస కేంద్రాలకు తరలించి భోజనం, తాగు నీటి సదుపాయాలు కల్పిస్తున్నారు
జనం కట్టుబట్టలతో ఇళ్లలో నుంచి బయటకు వచ్చేశారు
డ్రోన్ల ద్వారా వరద బాధితులకు భోజనాన్ని సరఫరా చేస్తున్న దృశ్యం
జంట జలాశయాల గేట్లు తెరవడంతో మూసీకి వరద ప్రవాహం పెరిగింది
Updated Date - Sep 27 , 2025 | 04:43 PM