Bonalu Festival 2025: ఉజ్జయినీ మహాకాళి దేవాలయంలో రంగం వినిపించిన స్వర్ణలత
ABN, Publish Date - Jul 14 , 2025 | 07:47 PM
ఉజ్జయిని మహాంకాళి ఆలయంలో (Ujjaini Mahakali Temple) ఈరోజు (సోమవారం) రంగం కార్యక్రమం ఘనంగా జరిగింది. బోనాలు పండుగ తర్వాతి రోజు జరిగే రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి (Swarnalatha Bhavishya Vani) వినిపించారు.
ఆషాఢం మాసం కావడంతో.. తెలంగాణలో బోనాలు పండగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. సికింద్రాబాద్‌లో కొలువు తీరిన ఉజ్జయినీ మహాకాళి దేవాలయంలో సోమవారం అంటే.. జులై 14వ తేదీ రంగం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. అమ్మవారి ఎదురుగా పచ్చి కుండపై నిలబడి ఆమె భవిష్యవాణి చెప్పారు.
ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తెలిపారు. తాను కోపంగా లేనన్నారు.
తాను కన్నెర్ర చేస్తే రక్తం కక్కుకుంటారంటూ హెచ్చరించారు.
తన భక్తులు సమర్పించిన బోనాలను సంతోషంగా అందుకున్నానన్నారు.
కానీ ప్రతీ ఏడాది ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉన్నారు చెప్పారు.
ప్రతీ సంవత్సరం చెబుతున్నప్పటికీ తనను లెక్క చేయడం లేదన్నారు.
నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించాలని పేర్కొన్నారు.
నా కోపానికి మీరు బలి అవుతారు.. కానీ నేను కోపం చూపించడం లేదు. నేను కన్నెర్ర చేస్తే మీరు రక్తం కక్కుకుని చస్తారన్నారు.
దేవాలయం వద్ద అమ్మవారిని ఊరేగిస్తున్న దృశ్యం.
దేవాలయం బయట భక్తుల కిటకిట..
దేవాలయం వెలుపల.. ఏనుగుపై అమ్మవారి ఊరేగింపు..
దేవాలయంలో అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్‌లో వేచి ఉన్న భక్తులు
సికింద్రాబాద్‌లో ఉజ్జయినీ దేవాలయంలో కొలువు తీరిన మహాకాళి అమ్మవారు.
Updated Date - Jul 14 , 2025 | 07:55 PM