ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Jubilee Hills By Election: నామినేషన్ దాఖలు చేసిన మాగంటి సునీత

ABN, Publish Date - Oct 15 , 2025 | 01:59 PM

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో సదరు ఉప ఎన్నికల నగారా మోగింది. ఆ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత.. బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.

1/7

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆమె నామినేషన్ పత్రాలు సమర్పించారు.

2/7

ఆమె వెంట పార్టీ కార్యనిర్వాక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, పద్మారావు గౌడ్‌, పి. విష్ణువర్థన్ రెడ్డిలతోపాటు పలువురు నేతలు, కార్యకర్తలు ఉన్నారు.

3/7

ఈ నామినేషన్ వేసే ముందు బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి మాగంటి సునీత చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు.

4/7

అనంతరం నియోజకవర్గంలోని నేతలను ఆమెకు పరిచయం చేశారు. ఆ తర్వాత నామినేషన్ దాఖలు చేసేందుకు ఆమె షేక్ పేట ఎమ్మార్వో కార్యాలయానికి ఊరేగింపుగా బయలుదేరి వెళ్లారు.

5/7

అనారోగ్య కారణాలతో 2025, జూన్ 8వ తేదీన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది.

6/7

దాంతో మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతని తమ అభ్యర్థిగా ఈ ఎన్నికల బరిలో బీఆర్ఎస్ నిలిపింది.

7/7

నవంబర 11వ తేదీన ఈ ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 14వ తేదీన కౌంటింగ్ చేపట్టనున్నారు.

Updated Date - Oct 15 , 2025 | 02:02 PM