Jubilee Hills Bypoll Counting: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం.. గెలుపెవరిదో
ABN, Publish Date - Nov 14 , 2025 | 10:17 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ మొదలైంది. హైదరాబాద్ యూసఫ్‌గూడా స్టేడియంలో కౌంటింగ్ కొనసాగుతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేపట్టగా.. కాంగ్రెస్ పార్టీ అధిక్యత సాధించింది. అనంతరం ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభమైంది. ఒక్కో రౌండ్ లెక్కింపు 30 నిముషాల్లో పూర్తయ్యే అవకాశం ఉంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది.
యూసుఫ్ గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ కొనసాగుతోంది.
ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది.
తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరిగింది.
పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో నిలిచింది.
పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభమైంది.
కౌంటింగ్ కేంద్రానికి ప్రధాన పార్టీల ఏజెంట్లు చేరుకున్నారు.
మొత్తం 10 రౌండ్స్‌లో 42 టేబుల్స్‌గా కౌంటింగ్ జరుగుతోంది.
కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు.
కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు
ఈరోజు మధ్యాహ్నం వరకు జూబ్లీహిల్స్ ఫలితం తేలనుంది
నవంబర్ 11న పోలింగ్ జరుగగా.. 48.49 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.
జూబ్లీహిల్స్ ఫలితంపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్న మీడియా.
Updated Date - Nov 14 , 2025 | 10:18 AM