సమ్మక్క సారక్క దర్శనంకు పోటెత్తిన భక్తులు
ABN, Publish Date - Dec 07 , 2025 | 03:50 PM
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు అత్యంత వైభవంగా జరగనుంది. ములుగు జిల్లా కేంద్రం నుంచి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో మారుమూల అటవీ ప్రాంతంలో మేడారం గ్రామం ఉంది.
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు అత్యంత వైభవంగా జరగనుంది.
ఈ మహా జాతర ప్రారంభానికి ముందే భక్తులు భారీగా సమ్మక్క సారలక్క దేవతలను దర్శించుకుని ముక్కులు చెల్లిస్తున్నారు. ఆదివారం మేడారంకు భక్తులు పోటెత్తారు.
సమ్మక్క సారలమ్మ దేవతలకు భక్తులు నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వెళ్లారు.
ప్రతి రెండేళ్లకోసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున జరిగే మేడారం మహా జాతరలో లక్షలాది మంది భక్తులు దేశం నలుమూలల నుంచి తరలివస్తారు.
ఈ సారి గతం కంటే మరింత వైభవంగా జాతర నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని అధికారులు తెలిపారు.
జనవరిలో నిర్వహించే మేడారం మహా జాతర ఎన్నడూ లేని రీతిలో వైభవోపేతంగా నిర్వహించనున్నామని అధికారులు వెల్లడించారు.
ములుగు జిల్లా కేంద్రం నుంచి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో మారుమూల అటవీ ప్రాంతంలో మేడారం గ్రామం ఉంది.
Updated Date - Dec 07 , 2025 | 03:50 PM