ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Homemade Paneer Recipe: స్వచ్ఛమైన పనీర్‌.. ఇంట్లో ఇలా ఈజీగా తయారు చేసుకోండి..!

ABN, Publish Date - Oct 15 , 2025 | 09:49 PM

ఇందుగలదందు లేదని.. ఎందెందు వెతికినా అందందు కల్తీయే.. అని అనుకోవాల్సిన కాలమిది. అవును మరి.. ప్రస్తుత కాలంలో ప్రతీది కల్తీయే అవుతుంది. కాసుల కక్కుర్తితో కొందరు వ్యాపారులు ప్రతీది కల్తీ చేస్తున్నారు. పాలు మొదలు..

1/7

ఇందుగలదందు లేదని.. ఎందెందు వెతికినా అందందు కల్తీయే.. అని అనుకోవాల్సిన కాలమిది. అవును మరి.. ప్రస్తుత కాలంలో ప్రతీది కల్తీయే అవుతుంది. కాసుల కక్కుర్తితో కొందరు వ్యాపారులు ప్రతీది కల్తీ చేస్తున్నారు. పాలు మొదలు.. ప్రతీ ప్రదార్ధాన్ని కల్తీ చేసేస్తు్న్నారు. దాని ఫలితమే.. జనాలు 30 ఏళ్లకే మూలన పడే పరిస్థితి నెలకొంది.

2/7

చాలా మంది ఆరోగ్యానికి మంచిదని పాలు కొనుగోలు చేసి తాగుతుంటారు. ప్రతి ఇంట్లో పాలు లేనిది నడవదనే విషయం తెలిసిందే. అందుకే.. కొందరు కేటుగాళ్లు.. కల్తీ పాలను విక్రయిస్తుంటారు. ఇది తెలియని జనాలు.. నిజమైన పాలని నమ్మి తాగేస్తుంటారు.

3/7

పాలు మాత్రమే కాదండోయ్.. పాల ఉత్పత్తులను సైతం కల్తీ చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. అసలు పాలే లేకుండా.. పాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. అన్నింట్లో పనీర్ విషయానికి వస్తే మరీ దారుణం అనే చెప్పాలి. మార్కెట్‌లో లభించే పనీర్‌ను సింథటిక్ పాలు, స్టార్చ్, ఇతర రసాయనాలు, డిటర్జెంట్లతో తయారు చేస్తున్నారు. ఈ విషయాన్ని అనేక సర్వేలు వెల్లడించాయి.

4/7

వాస్తవానికి పనీర్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అందుకే.. చాలా మంది పనీర్ తినేందుకు ఆసక్తి చూపుతారు. కానీ, ఇలాంటి కల్తీ పనీర్ తినడం వలన.. ఆరోగ్యానికి బదులుగా.. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి నకిలీ పనీర్‌కు బదులుగా.. ఇంట్లోనే స్వచ్ఛమైన పనీర్‌ను తయారు చేసుకోవచ్చు.

5/7

ఇంట్లో స్వచ్ఛమైన, మృదువైన, ఆరోగ్యకరమైన పనీర్‌ను తయారు చేసుకోవచ్చు. ఇంట్లో తయారు చేసిన పనీర్ రుచిగా ఉండటమే కాకుండా.. కల్తీ లేని స్వచ్ఛమైన పనీర్‌ను ఆస్వాదించొచ్చు. ఇంట్లోనే స్వచ్ఛమైన పనీర్‌ను ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంట్లోనే పనీర్ తయారు చేసుకోవడానికి ఫుల్ క్రీమ్ పాలు, నిమ్మరసం అవసరమవుతుంది.

6/7

ముందుగా ఒక లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుని.. గిన్నెలో పోసి మరిగించాలి. పాలు మరిగేటప్పుడు మంటను తగ్గించి.. నిమ్మరసం గానీ.. వెనిగర్‌ గానీ కొద్దిగా కలపాలి. కాసేపటికి పాలు విరిగిపోతాయి. అలా విరిగిపోయిన తరువాత స్టౌ ఆపివేయాలి. ఒక తెల్లని వస్త్రం తీసుకుని.. విరిగిపోయిన పాలను వడగట్టాలి. నీరంతా వడకట్టి.. మిగిలిన ముద్దను వేరుగా పెట్టుకోవాలి.

7/7

అలా విరిగిన పాల ముద్ద నుంచి చుక్క నీరు లేకుండా పిండేయాలి. ఆ తరువాత వస్త్రం నుంచి ఆ ముద్దను బయటకు తీయాలి. మెత్తగా మిక్స్ చేయాలి. కాసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఆ తరువాత స్వచ్ఛమైన పనీర్ రెడీ అవుతుంది. ఇక మీరు ఆ పనీర్‌ను కూర వండుకోవడం గానీ, స్వీట్స్‌గా, స్నాక్స్‌లో గానీ ఉపయోగించవచ్చు.

Updated Date - Oct 15 , 2025 | 09:51 PM