Munneru Floods: మొంథా తుపాను ఎఫెక్ట్.. మున్నేరుకు వరద ఉధృతి
ABN, Publish Date - Oct 30 , 2025 | 01:53 PM
మొంథా తుపాను ప్రభావంతో ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మున్నేరు వరద ఉధృతి పెరుగుతూ ఉండటంతో స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆదేశించారు.
మొంథా తుపాను ప్రభావంతో మున్నేరుకు పోటెత్తిన వరద.
మున్నేరుకు 24.5 అడుగుల మేర వర్షపు నీరు చేరింది.
మున్నేరు పరివాహక ప్రాంతాలైన బొక్కల గడ్డ వెంకటేశ్వరనగర్, మోతీనగర్, ప్రభావతి నగర్‌లో ఇండ్లు నీట మునిగాయి.
తుపాను బాధితులకు ఖమ్మం నయా బజార్ కాలేజీలో వసతిని ఏర్పాటు చేశారు.
మున్నేరుకు వరద ఉధృతి పెరగడంతో పునరావాసకేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు.
ఖమ్మం కలెక్టర్ అనుదీప్, సీపీ సునీల్ దత్తతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు మంత్రి తుమ్మల.
మున్నేరు పరివాహక ప్రాంతంలో ప్రజలకు ఎక్కడ సౌకర్యం కలగకుండా.. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8 డివిజన్ల పరిధిలో మున్నేరు ప్రవహిస్తోంది.
మున్నేరు పరివాహ ప్రాంతంలో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇళ్ల నుంచి ఖాళీ చేయించిన అధికారులు.
మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు పునరావాస కేంద్రంకు తరలించారు.
వరద ప్రవాహం తగ్గుముఖం పట్టాలని స్థానికుల పూజలు
వరద నీటిలో చిన్నారుల ఆటలు
వరద ప్రవాహంలో కొట్టుకొచ్చిన పామును పట్టుకున్న స్థానికుడు
వరద నీటిలో మునిగిన ఎల్లమ్మ తల్లి దేవాలయం
Updated Date - Oct 30 , 2025 | 01:54 PM