Chiranjeevi Meets Hyderabad CP: హైదరాబాద్ సీపీ సజ్జనార్‌తో మెగాస్టార్ చిరంజీవి భేటీ
ABN, Publish Date - Oct 11 , 2025 | 09:30 PM
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌తో మెగాస్టార్ చిరంజీవి సమావేశమయ్యారు. శనివారం సీపీ కమిషనరేట్‌లో సజ్జనార్‌తో హీరో చిరంజీవి భేటీ అయ్యారు.
మెగాస్టార్ చిరంజీవి.. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌తో శనివారం (2025, అక్టోబర్ 11) భేటీ అయ్యారు. శనివారం పోలీస్ కమిషనరేట్‌లో సీపీని హీరో చిరంజీవి కలిశారు. హైదరాబాద్ నగర సీపీగా ఇటీవల వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టారు.
ఈ నేపథ్యంలో ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో సైతం హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా వీసీ సజ్జనార్ విధులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో దేశవ్యాప్తంగా కరోనా విజృంభించి ఉంది.
దీంతో ప్లాస్మా దానం ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వీరిద్దరు కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న విషయం విదితమే. చిరంజీవి వెంటనే ఆయన పెద్ద కుమార్తె సుష్మిత కూడా ఉన్నారు.
Updated Date - Oct 11 , 2025 | 09:30 PM