Bonalu Festival 2025: రాత్రి వేళ.. విద్యుత్ దీపాల అలంకరణతో ఉజ్జయినీ మహకాళి ఆలయం
ABN, Publish Date - Jul 11 , 2025 | 09:39 PM
Bonalu Festival 2025: ఆషాఢ మాసం సందర్భంగా తెలంగాణలో బోనాల ఉత్సవాల ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహకాళికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. ఆ క్రమంలో అమ్మ వారి ఆలయ పరిసర ప్రాంతం నిత్యం భక్తులతో కిటకిటలాడుతోంది. అలాగే అమ్మ వారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఉజ్జయిని మహకాళి ఆలయానికి పోటెత్తుతున్నారు.
బోనాల సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళి దేవాలయానికి విద్యుత్ దీపాలు అలంకరించారు. రాత్రి వేళలో ఆ పరిసర ప్రాంతాలన్నీ కాంతులీనుతున్నాయి.
భక్తులతో కిటకిటలాడుతున్న మహకాళి ఆలయం
ఉజ్జయిని మహకాళి దేవాలయం వద్ద అమ్మవారి బొమ్మలతో విద్యుత్ దీపాలంకరణ.
మహకాళి ఆలయ పరిసర ప్రాంతాల్లో అమ్మవారు, దేవాలయం బొమ్మలతో విద్యుత్ దీపాలంకరణ.
ఆలయ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ దీపాలంకరణ.
రహదారులకు ఇరు వైపులా విద్యుత్ దీపాలంకరణ
Updated Date - Jul 11 , 2025 | 09:41 PM