భూపాలపల్లి జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
ABN, Publish Date - Dec 17 , 2025 | 10:25 AM
తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది.
తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది.
ఈ విడతలో సుమారు 53 లక్షల మంది ఓటర్లున్నారు. వారిలో పురుషులు 26 లక్షలు, మహిళలు 27 లక్షలు, ఇతరులు కొద్దిమంది ఉన్నారు.
మూడవ దశలో భాగంగా 182 మండలాల్లోని 4,159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే వీటిలో 394 సర్పంచి స్థానాలు, 7,908 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.
అందువల్ల 3,752 గ్రామ పంచాయతీలకూ, 28,410 వార్డులకూ పోలింగ్ జరుగుతోంది. భూపాలపల్లి జిల్లాలో ఉదయం నుంచే ప్రజలు క్యూ లైన్లో నిలబడి ఓటు వేస్తున్నారు.
మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. సాయంత్రానికి ఫలితాలు ప్రకటిస్తారు.
Updated Date - Dec 17 , 2025 | 10:38 AM